తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆకట్టుకుంటున్న అమితాబ్​-రష్మిక 'గుడ్​బై' ట్రైలర్​ - hansika maha movie trailer

Goodbye trailer: అమితాబ్​ బచ్చన్​, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన గుడ్​బై చిత్ర ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దీంతో పాటు పలు చిత్రాల అప్డేట్స్​ ఉన్నాయి. అవి ఏంటంటే.

Amitab bachan Rashmika Goodbye trailer
అమితాబ్​-రష్మిక గుడ్​బై ట్రైలర్​

By

Published : Sep 6, 2022, 2:37 PM IST

Updated : Sep 6, 2022, 3:51 PM IST

Goodbye trailer: బాలీవుడ్​ దిగ్గజ దర్శకుడు అమితాబ్‌ బచ్చన్‌, నేషనల్ క్రష్​ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గుడ్​బై. వికాస్‌ బహల్‌ దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ విడుదలైంది. ఇందులో బిగ్​ బీ కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా కనిపించగా.. రష్మిక వాటిని వ్యతికేరించే కూతురిగా కనిపించింది. మొత్తంగా ఈ ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఏక్తా కపూర్‌ నిర్మాత. నీనా గుప్తా, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

కాగా, గుడ్‌బై సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన కథాంశంగా తీసుకున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో అమితాబ్‌, నీనా గుప్తా నటించారు. తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు వాదిస్తోంది. వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయమిది.. అయినా ఇది బర్త్‌డే కాదు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగి చేయడానికి అని ఆ తండ్రి వాదిస్తారు. మొత్తానికి ట్రైలర్‌ ఆకట్టుకునేలా సాగింది. ఓ మనిషిని సాగనంపే సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా లేక సాంప్రదాయాన్నా అన్న చర్చను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

Vikranth rona trailer: సుదీప్‌ నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్‌ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జులైలో థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ఈ నెల 16 నుంచి అందుబాటులోకి రానుంది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌, రవిశంకర్‌ గౌడ తదితరులు నటించి మెప్పించారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ విడుదల చేసింది.

7days 6 nights ott release: ఎం. ఎస్‌. రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్‌ , మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా రూపొందించిన చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. జూన్‌ 24న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా సెప్టెంబరు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్రైలర్‌ విడుదల చేసింది.

Sitaramam ott release date: దుల్కర్‌ సల్మాన్‌ - మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం 'సీతారామం'. ఆగస్టు నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్‌ వేదికగా సినీప్రియులను అలరించనుంది. 'అమెజాన్‌ ప్రైమ్‌' లో సెప్టెంబరు 9 నుంచి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ మంగళవారం వెల్లడించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి రష్మిక మందన, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమాస్‌ ఈ సినిమాను నిర్మించింది. ఇటీవలే ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేశారు.

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'మహ'. ఈ సినిమా ఓటీటీ విడుదల తాజాగా ఖరారైంది. ఈ చిత్రం ఈ నెల 9 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ ఓ పోస్ట్‌ర్‌ని పంచుకుంది. శ్రీకాంత్‌, శింబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 22న థియేటర్లలో విడుదలై, మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. హన్సిక 50వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకి యు. ఆర్‌. జమీల్‌ దర్శకత్వం వహించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు కిడ్నాప్‌నకు గురైతే, తల్లిగా కథానాయిక ఏం చేసింది? అసలు ఆ పాపను తీసుకెళ్లిందెవరు? ఎందుకు తీసుకెళ్లారు? అనేవి ఈ చిత్రంలోని ఆసక్తికర అంశాలు.

ఇదీ చూడండి: వెంకీ​ నటించిన ఆ సూపర్​ హిట్​ ఫిల్మ్​ తరుణ్​ చేయాల్సింది.. కానీ

Last Updated : Sep 6, 2022, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details