Amitab bachan metro rail: 'ప్రాజెక్ట్ కె'లో భాగంగా దిగ్గజ నటుడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. ట్రైన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో షేర్ చేసిన ఓ నెటిజన్.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.
కాగా, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.