టాలీవుడ్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కె మూవీ చిత్రీకరణల్లో నిమగ్నమైన ఈ పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఈ బిజీ షెడ్యూల కారణంగా ప్రభాస్ అనారోగ్యం బారిన పడ్డారని తెలుస్తోంది. ఆయనకు జ్వరం వచ్చిందని సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతున్న తన సినిమాల షూటింగులన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్స్ క్యాన్సిల్.. ఆందోళనలో ఫ్యాన్స్! - ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సలార్‌తో పాటు పలు ప్రాజెక్టులకు సైన్ చేసిన ఈ స్టార్ హీరో ఆయా షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే దీని వల్ల ఆయన అనారోగ్యం పాలయ్యారట. ఆ వివరాలు..
కాగా ప్రభాస్.. త్వరలోనే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు సలార్ చిత్రీకరణ కూడా దాదాపు ముగిసిందట. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతీతో చేయబోయే సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇకపోతే త్వరలోనే ఆయన పఠాన్‌తో సూపర్ సక్సెస్‌ను అందుకున్న సిద్ధార్థ్ ఆనంద్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. వీటన్నిటితో పాటు ఆయన సందీప్ రెడ్డి వంగాతోనూ స్పిరిట్ అనే సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.