తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2022, 3:18 PM IST

ETV Bharat / entertainment

పెళ్లైన కొద్ది గంటలకే పాప్ సింగర్ మృతి.. ఫ్యాన్స్​ షాక్​

అమెరికన్ సింగర్ జేక్ ఫ్లింట్ ఇకలేరు. ఆయన తుదిశ్వాస విడిచారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన... చిన్న వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్ళడాన్ని ఆయన బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నిటి కంటే విషాదం ఏంటంటే... పెళ్ళైన కొన్ని గంటలకు ఆయన మరణించడం!

American pop singer died
పెళ్లైన కొద్ది గంటలకే పాప్ సింగర్ మృతి.. ఫ్యాన్స్​ షాక్​

పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ప్రముఖ సింగర్ హఠాణ్మరణం చెందాడు. ఘనంగా విహవాం జరిగిన కొన్ని గంటలకే నిద్రలోనే కన్నుమూశాడు. దీంతో ఆయన భార్యతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

చిన్న వయసులోనే చనిపోయిన ఈ హాలీవుడ్​ సింగర్‌ పేరు జేక్ ఫ్లింట్. వయసు 37ఏళ్లు. అమెరికా ఓక్లామాలో 1985లో జన్మించాడు. స్థానికంగా అక్కడ అతను చాలా పాపులర్​. బ్రెండ్ విల్సన్‌ను శనివారం పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే జేక్ మరణించడం కలకలం రేపింది. ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియలేదు.

జేక్ మృతిని అతని స్నేహితుడు ప్రచారకర్త క్లిఫ్ డోయల్ సోషల్​మీడియాలో తెలపగా.. అతడి అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తూ.. కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

భర్త మరణ వార్తను బ్రెండా విల్సన్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఎవరికీ ఇంత బాధ రాకూడదని ఆమె పేర్కొన్నారు. ''ప్రజలు ఎవరూ ఇంత బాధను అనుభవించకూడదు. నా హృదయం వెళ్ళిపోయింది. ఆయన తిరిగి రావాలి. నేను ఇంత కంటే ఎక్కువ బాధను భరించలేను. ఇప్పుడు నాకు ఆయన కావాలి" అని బ్రెండా ఆ పోస్టులో పేర్కొన్నారు. తామిద్దరం కలిసి పెళ్ళి ఫోటోలు చూడాల్సిన సమయంలో భర్త అంత్యక్రియల కోసం దుస్తులు తీసుకు వెళ్ళాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, వాట్స్ యువర్ నేమ్, లాంగ్ రోడ్ బ్యాక్ హోం, కౌ టౌన్, ఫైర్ లైన్ వంటి హిట్ ఆల్బమ్స్‌తో జేక్ అమెరికాలో పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని మొదటి ఆల్బమ్ అయామ్ నాట్ ఓకే.. 2016లో రిలీజ్ అయింది. ఆ తర్వాత వరుసగా చాలా ఆల్బమ్స్‌తో సంగీత ప్రియులను అలరించాడు. లైవ్ ఈవెంట్స్‌ చేస్తూ ప్రత్యేక క్రేజ్​ను దక్కించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details