పాకిస్థాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. "ఇమ్రాన్ అబ్బాస్ నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. యూఎస్‌లో చదువుకుంటున్నప్పుడు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం. అతడు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే కావడం వల్ల మేమిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఇటీవల అతడిని కలిశా. ఆ సమయంలో సరదాగా ఓ ఇన్‌స్టా రీల్ చేశాం. వీడియో చూడ్డానికి బాగుందని నెట్టింట్లో షేర్ చేశా. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో.. దీన్ని చూసిన వారు అతడితో నేను డేటింగ్‌లో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. వాటిని విని నేను బాగా నవ్వుకుంటున్నా" అని అమీషా వివరించారు.
పాకిస్థాన్ యాక్టర్‌తో స్టార్ హీరోయిన్ రొమాన్స్.. వీడియో వైరల్! - అమీషా పటేల్ రూమర్స్ డేటింగ్
పాకిస్థాన్ నటుడితో తాను డేటింగ్‌లో ఉన్న విషయమై స్పందించారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. ఏం అన్నారంటే..
అమీషా పటేల్
ఇటీవల బహ్రెయిన్‌కు వెళ్లిన అమీషా.. ఇమ్రాన్, ఇతర స్నేహితులతో సరదాగా గడిపారు. ఇందులో భాగంగానే ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఓ ప్రేమ పాటకు వీడియో చేశారు.
ఇదీ చూడండి:'పొన్నియిన్ సెల్వన్ 1' తారలకు పాలాభిషేకం.. థియేటర్ల వద్ద కోలాహలం