యూత్‌కు స్టైలిష్ ఐకాన్.. అమ్మాయిలకు ప్రేమను పంచే 'ఆర్య'.. 'డీజే' సైతం పగిలిపోయేలా స్టెప్‌లు వేసే డ్యాన్సర్.. కథ, అందులోని పాత్ర కోసం తనని తాను మలుచుకునే నటనా శిల్పి.. కేవలం నటనే కాదు, కుటుంబానికీ ప్రాధాన్యం ఇచ్చే ఫ్యామిలీమన్.. అభిమానులకు ముద్దుల బన్నీ.. ఆయనే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. అయితే ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు బన్నీ తమ్ముడు అల్లుశిరీష్. అన్న బాటలోనే సినిమాల్లో రాణిస్తూ కెరీర్లో సరైన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఊర్వశి రాక్షసివో సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఆలీతో సరాదాగా కార్యక్రమంలో పాల్గొన్న తన కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఇందులో భాగంగానే అల్లుఅర్జున్ తన సీక్రెట్స్ ఎవరితో పంచుకుంటారో వివరించారు.
అల్లుఅర్జున్ సీక్రెట్స్‌ను అతడికే చెప్తారట.. భార్యకు కూడా నో - అల్లు శిరీష్ ఆలీతో సరదాగా
మాస్, క్లాస్, యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అందరినీ మెప్పిస్తున్న ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్.. ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత విజయవంతమైన హీరోల్లో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు ఆయన తమ్ముడు అల్లు శిరీష్. ఏంటంటే..
తన ఫస్ట్ చిత్రం గురించి మాట్లాడారు శిరీష్. అది 98 శాతం మందికి నచ్చలేదని, ఒకవేళ ఆ మూవీ బాగుందని ఎవరైనా చెబితే మాత్రం కచ్చితంగా హ్యాపీగా ఫీలవుతానని అన్నారు. అలానే తన తాజా సినిమాలోని లిఫ్ట్‌లో లిప్‌లాక్ గురించి ఫన్నీగా స్పందించారు. యూత్‌కి ఇదంతా చాలా మూములు విషయమని చెప్పారు. ఈ సన్నివేశం సింగిల్ టేక్లోనా లేదా ఎక్కువగా అని అలీ అడగ్గా.. ఏం చెప్పాలో తెలీక శిరీష్ తల పట్టుకున్నారు. ఇక 'పుష్ప' రిలీజ్ సమయానికి తాను ముంబయిలో ఉన్నానని.. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే.. తనకు చాలా గొప్పగా అనిపించిందని పేర్కొన్నారు. అలానే ఎవ్వరికీ చెప్పని సీక్రెట్స్ బన్నీ నీకు చెప్తాడట కదా అని అలీ అడగ్గా.. శిరీష్ అవునని సమాధానమిచ్చారు. తన వదిన(అల్లు స్నేహ) తనకు గన్ పెట్టి అడిగినా సరే అవి బయటపెట్టనని నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి:సల్మాన్ ఖాన్‌కు Y+ సెక్యూరిటీ.. కారణం ఇదే...