తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ హీరోయిన్​తో అల్లు శిరీష్​ లిప్​లాక్​.. వీడియో చూశారా? - శాకినీ డాకిని ఓటీటీ రిలీజ్ డేట్​

మెగాహీరో అల్లుశిరీష్​ హీరోయిన్​ అను ఇమ్మాన్యుయేల్​తో లిప్​లాక్, రొమాన్స్​ చేస్తున్న వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. మీరు చూశారా?

allusirish
అల్లుశిరీష్​

By

Published : Sep 29, 2022, 6:35 PM IST

లిప్​లాక్ కిస్​, రొమాంటిక్ సీన్స్​.. అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. యువత లక్ష్యంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌లో వినిపించిన సంభాషణలను బట్టి అర్థమవుతోంది. స్నేహానికి, ప్రేమకు మధ్య తేడాను వివరించే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లు స్టైలిష్‌గా కనిపించారు. టీజర్‌లో వెన్నెల కిశోర్‌ తనదైన శైలి హాస్యం పంచారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్​ఫుల్​ డైలాగ్​ ఇతనివే.. "ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము తిన్నారు ఒక్కొక్కరూ. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా. ఇందులో ఒకటే రూల్‌.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం. తప్పుచెయ్యాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి. లేదంటే.. మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది".. బుధవారం సాయంత్రం అనంతపురంలో జరిగిన 'గాడ్‌ ఫాదర్‌' ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది.

ఈవెంట్‌లో భాగంగా 'గాడ్ ఫాదర్‌'లోని ఈ డైలాగ్‌ చెప్పి వేడుకకు వచ్చిన అభిమానులను ఆయన అలరించారు. దీంతో ఈ డైలాగ్‌ కాస్త ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. డైలాగ్‌ అద్భుతంగా ఉందంటూ అభిమానులు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేసిన వ్యక్తిని చిరు అందరికీ పరిచయం చేశారు."గాడ్ ఫాదర్' చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్‌కు నా అభినందనలు! మంచి ప్రతిభ ఉన్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నా" అని పేర్కొన్నారు. లక్ష్మీ భూపాల్‌ గతంలో 'నేనే రాజు నేనే మంత్రి', 'ఓ బేబీ', 'గోవిందుడు అందరివాడేలే' వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. ఇక, మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న 'లూసిఫర్‌'కు రీమేక్‌గా 'గాడ్‌ ఫాదర్‌' సిద్ధమైంది. మోహన్‌రాజా దర్శకుడు. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలకపాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈసినిమా విడుదల కానుంది.

ఓటీటీలోకి శాకిని డాకిని.. నివేదా థామస్‌, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'శాకిని డాకిని'. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. 'నెట్‌ఫ్లిక్స్‌'లో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ ప్రకటన చేస్తూ ఆ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ విడుదల చేసింది. 'శాకిని డాకిని వస్తున్నారు. భయపడకండి.. ఈసారి ఎంటర్‌టైన్‌ చేయటానికి మాత్రమే' అని 'నెట్‌ఫ్లిక్స్‌' పోస్ట్‌ పెట్టింది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న థియేటర్లలో విడుదలైంది.

జిన్నా కొత్త రిలీజ్ డేట్​.. తాను నటించిన జిన్నా చిత్రం కొత్త విడుదల తేదీని ప్రకటించారు హీరో మంచు విష్ణు. అక్టోబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 5న జిన్నా ట్రైలర్ విడుదలవుతున్నట్లు విష్ణు వెల్లడించారు. సినిమా జయాపజయాలు తమ చేతులో లేవని, కష్టపడటం మాత్రమే తమ చేతుల్లో ఉందన్నారు. యూనిట్ అంతా కలిసి ఒకే కుటుంబంగా కష్టపడ్డామన్న విష్ణు.... ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచేందుకు జిన్నా చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిట్లు తెలిపారు. జిన్నా చిత్రానికి దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మూలకథ అందించగా... సూర్య దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. విష్ణుకు జోడిగా పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ నటించారు.

ఇదీ చూడండి: దీపికా పదుకొణెతో మనస్పర్థలు.. రణ్​వీర్​ ఏం చెప్పారంటే?

ABOUT THE AUTHOR

...view details