Geetha Arts upcoming movies : తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిటి చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థలలో గీతాఆర్ట్స్ ఒకటి. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు కొత్తదనం నిండిన బలమైన కంటెంట్‌తో ఉంటాయనే నమ్మకం సినీ ఆడియెన్స్‌లో ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే ఈ బ్యానర్‌లో ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు గీతా ఆర్ట్స్‌కు అనుబంధంగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి కొత్త ప్రతిభను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇతర భాషల హిట్ చిత్రాలను ఇక్కడ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు
అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గత రెండేళ్ల నుంచి ఎలాంటి సినిమా రాలేదు. చివరిగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అలా వైకుంఠపురం' మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేయడం గానీ నిర్మించడం గానీ చేయలేదు. అయితే తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రానున్న చిత్రాలపై నిర్మాత అల్లు అరవింద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ముగ్గురు డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.
Geetha Arts Boyapati : "బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ మా బ్యానర్‌లో చేస్తారు. ఇద్దరు హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సురేందర్ రెడ్డి కూడా మా బ్యానర్లోనే ఓ సినిమా చేయనున్నారు. అది కూడా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయి. అంతా ఓకే అయ్యాక ప్రకటిస్తాం." అని అన్నారు.