Alluarjun Atlee movie: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు సెలబ్రిటీలు సైతం 'పుష్పరాజ్'పై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఇచ్చిన కిక్‌తో రెండో భాగం కోసం రెడీ అవుతున్న బన్నీ.. మరో పాన్‌ఇండియా సినిమా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్ డైరెక్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇటీవలే బయటకు వచ్చింది.
స్టార్ దర్శకుడిని రిజెక్ట్ చేసిన అల్లుఅర్జున్.. కారణమిదేనా? - అట్లీని రిజెక్ట్ చేసిన అల్లుఅర్జున్
'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరో అల్లుఅర్జున్.. తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా నెలకొంది. అయితే తాజాగా బన్నీ.. ఓ ప్రముఖ దర్శకుడితో కలిసి పని చేసే అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించారట! ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? బన్నీ ఎందుకలా చేశారు? తెలుసుకుందాం...
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో బన్నీ ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు, దానికి దర్శకుడిగా 'రాజారాణి', 'థేరి', 'మెర్సల్' చిత్రాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అట్లీని ఎంపిక చేయాలని చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అట్లీ-బన్నీ కాంబోలో సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం కనిపించట్లేదు. అల్లుఅర్జున్.. అట్లీని పక్కనపెట్టారని తెలిసింది. ఎందుకంటే అట్లీ.. మూవీని తెరకెక్కించేందుకు ఏకంగా రూ.35కోట్లు పారితోషికం అడిగారట! దీంతో షాక్ అయిన బన్నీ.. అట్లీతో సినిమా చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. సున్నితంగా ఆయన్ను సైడ్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదుగాని ఈ విషయం గురించి తెగ కథనాలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఐకాన్‌స్టార్.. 'పుష్ప 2' చిత్రీకరణ కోసం సిద్ధమవుతుండగా.. దర్శకుడు అట్లీ.. షారుక్ ఖాన్- నయనతారతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.
ఇదీ చూడండి: పవన్ 'ఖుషి', చిరంజీవి 'మేజర్'- అవే సినిమా పేర్లు.. కానీ హీరోలు ఛేంజ్