తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అల్లు అర్జున్​కు మరో అరుదైన గౌరవం.. నా లక్ష్యం చేరుకున్నానంటూ పోస్ట్​ ​ - అల్లు అర్జున్​కు మరో అరుదైన గౌరవం

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ విశేష గౌరవాన్ని అందుకున్నారు. ఈ అవార్డు తనకు వరించడం వల్ల తన లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు.

Alluarjun receives honour
అల్లు అర్జున్​కు మరో అరుదైన గౌరవం.. నా లక్ష్యం చేరుకున్నానంటూ పోస్ట్​ ​

By

Published : Dec 15, 2022, 1:39 PM IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. వినోద రంగంలో ప్రముఖంగా భావించే జీక్యూ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఈ ఏడాదికి గాను ఆయన్ని వరించింది. ఈ మేరకు సదరు మ్యాగజైన్‌ బృందం.. హైదరాబాద్‌కు చేరుకుని నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో బన్నీకి అవార్డును అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ తన లక్ష్యాన్ని అందుకున్నట్లు చెప్పారు.

"లీడింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ 2022గా నన్ను సత్కరించినందుకు జీక్యూ ఇండియాకు ధన్యవాదాలు. జీక్యూ మ్యాగజైన్‌ కవర్‌పై నా ఫొటో ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నా. నా జాబితాలోని ఓ టార్గెట్‌ని ఇలా అందుకున్నా" అని బన్నీ పేర్కొన్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో విశేష ఆదరణ పొందిన పలువురు స్టార్స్‌ను గుర్తించి జీక్యూ ఇండియా మ్యాగజైన్‌ ప్రతి ఏటా 'లీడింగ్‌ మ్యాన్‌', 'లీడిండ్‌ వుమెన్‌' అవార్డులను అందజేస్తుంటుంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులకు ఇప్పటి వరకూ ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు స్టార్‌ అల్లు అర్జున్‌ కావడం విశేషం. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం 'పుష్ప-2' పనుల్లో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి:గవర్నమెంట్​ జాబ్​ వదిలేశా.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా: సోహైల్

ABOUT THE AUTHOR

...view details