Alluarjun Google search list: 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మరో ఘనత సాధించారు. ఈ ఏడాది మిడ్ 2022 వరకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 100 ఏషియన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. దక్షిణాది నుంచి హీరోల్లో ఆయన అగ్రస్థానంలో నిలవగా.. హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈ గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో కోలీవుడ్ నుంచి విజయ్, తమిళంలో సూర్య టాప్‌లో నిలిచారు. ఇక వీరి తరువాత హీరోయిన్స్‌లో సమంత, నయనతార, తమన్నా పూజా హెగ్డే, లిస్ట్‌లో నిలవగా హీరోల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తదితరులు తదుపరి స్థానాలు దక్కించుకున్నారు. ప్లేయర్స్ విషయానికొస్తే క్రికెటర్లలో.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ టాప్10లో నిలిచాడు. ఆ తర్వాత ధోనీ, రోహిత్‌శర్మ, సచిన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఉన్నారు.
ఆ జాబితాలో కోహ్లీ, బన్నీ టాప్.. తర్వాత ఎవరున్నారంటే? - టాప్ 100 ఏషియన్ లిస్ట్
ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఘనతను అందుకున్నారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 100 ఏషియన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.
.
Last Updated : Jun 27, 2022, 9:31 PM IST