'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అ్లలుఅర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండో భాగం తర్వాత కూడా అదే స్థాయిలో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న బన్నీ మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అర్జున్.. ఓ యూనివర్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది మరేంటో కాదు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అని తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ గతేడాది యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమా తెరకెక్కించి ఇండియా వైడ్‌గా సూపర్ హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్.. ఇలా వరుస సినిమాలను ప్రకటించాడు. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుల్లో రోలెక్స్ తరహ పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఆ తర్వాత ఆ పాత్రతో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు. దీనిపై ఇటీవలే లోకేష్-అర్జున్ కూడా సమావేశమైనట్లు సమాచారం అందింది. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్.. దళపతి విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'ఖైదీ 2' ప్రాజెక్ట్ ఉంటుంది.