Alluarjun advertisements 10crores loss: 'పుష్ప' తర్వాత ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పుడా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పలు వాణిజ్య సంస్థలు అల్లు అర్జున్‌ను తమ ప్రకటనకర్తగా పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉన్న ఆయన భారీ పారితోషికం తీసుకుంటూ ఆయా ఉత్పత్తులను ప్రమోట్‌ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే, తాజాగా బన్నీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి? దాని వల్ల ఆయన ఎంత డబ్బుని వదులుకున్నాడంటే..?
బన్నీ షాకింగ్ నిర్ణయం.. రూ.10కోట్లు లాస్! - అల్లుఅర్జున్ యాడ్స్ రెమ్యునరేషన్
Alluarjun advertisements 10crores loss: అల్లుఅర్జున్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నిర్ణయం వల్ల రూ.10కోట్లు వదులుకున్నారట. అభిమానులను దృష్టిల్లో ఉంచుకునే అలా చేశారట.
'పుష్ప-2' పనుల్లో బిజీగా ఉన్న బన్నీ వరుస వాణిజ్య ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆయన గత కొన్నిరోజుల నుంచి వరుస యాడ్ షూట్స్‌లోనూ పాల్గొంటున్నారు. అలా ఇప్పటికే ఓ శీతలపానీయ ఉత్పత్తుల సంస్థ, బస్సు, స్కూటర్ ప్రయాణాలకు సంబంధించిన యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్ వంటి వాటికి బన్నీ ప్రకటనకర్తగా కొనసాగుతున్నారు. ఆయా బ్రాండ్ల యాడ్స్ కోసం కొన్ని గంటలపాటు పనిచేసినందుకు గానూ ఆయన రూ.7.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. అయితే, ఇటీవల బన్నీకి ఓ పొగాకు ఉత్పత్తుల సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. తమ యాడ్ షూట్ కోసం ఒక రోజులో కొన్ని గంటలపాటు కెమెరా ముందుకు వస్తే సుమారు రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి ఆ సంస్థ ఆఫర్ ఇచ్చిందట. భారీ మొత్తంలో డబ్బు వస్తున్నప్పటికీ బన్నీ మాత్రం ఆ యాడ్‌కు నో చెప్పారట. తాను అలాంటి ప్రకటనలు చేస్తే అభిమానులు కూడా తనని చూసి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడతారని.. అందుకే తాను ఆ ప్రకటన చేయనని అన్నారట. ఈ మేరకు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక యాడ్ కోసం రూ.10 కోట్లు ఇస్తామన్నా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేయనని చెప్పడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ హీరోయిన్ను చూస్తే జాలేస్తుంది.. ఫేమ్ కోసం మరీ ఇంతలా.. పంత్ ఆవేదన!