తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బన్నీకి ఛాలెంజ్​ విసిరిన కూతురు అర్హ.. ఓడిపోయిన ఐకాన్ స్టార్​ - alluarjun latest video viral

ఐకాన్​స్టార్ అల్లుఅర్జున్​.. తన కూతురు అర్హతో కలిసి సరదాగా గడిపిన ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్​ అవుతోంది.

alluarjun
బన్నీ

By

Published : Sep 20, 2022, 5:47 PM IST

'పుష్ప' విజయంతో మంచి జోరు మీదున్న అల్లు అర్జున్‌.. తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అలానే సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. ఇక స్టైల్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ఈ ఐకాన్‌ స్టార్‌ ఏకాస్త సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తుంటారు. అలా సరదాగా గడుపుతున్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో తన కూతురు అర్హతో కలిసి అల్లుఅర్జున్‌ సరదాగా సందడిచేశారు. అర్హ పొడుపు కథ అడిగితే దానికి అల్లు అర్జున్‌ సమాధానం చెప్పారు.

'గంగిగోవు పాలు గరిటెడైనా చాలు ఏమిటది' అని అర్హ ప్రశ్నించగా దానికి అల్లుఅర్జున్‌ 'జున్ను' అంటూ నవ్వుతూ తప్పు సమాధానం చెప్పారు. ఆ తర్వాత అర్హ టంగ్‌ ట్విస్టర్‌ను అడిగితే అల్లు అర్జున్‌ దానిని పలకలేక నవ్వుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీస్‌లో అల్లుఅర్జున్‌ పోస్ట్‌ చేశారు. పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే అది వైరలైంది. సెలబ్రెటీలు కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. ఆ టంగ్‌ట్విస్టర్‌ ఏంటో మీరు చూసేయండి.

ఇదీ చూడండి:గెట్​ రెడీ ఫ్యాన్స్​.. ఆ బ్లాక్​బస్టర్​ సినిమాతో మళ్లీ బాలయ్య రోర్​

ABOUT THE AUTHOR

...view details