తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఐకాన్​స్టార్ అల్లు అర్జున్ బ్లాక్​​బస్టర్​ మూవీ రీరిలీజ్!.. ఫ్యాన్స్​ ఫుల్​ హ్యాపీ!! - అల్లు అర్జున్ బ్లాక్​ బస్టర్​ మూవీ రీ రిలీజ్

టాలీవుడ్‌లో సూపర్​హిట్ సినిమాల రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్​హిట్‌ అయిన సినిమాలు బాక్సాఫీస్​ వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. తాజాగా ఐకాన్​స్టార్ అల్లు అర్జున్ నటించిన ఓ బ్లాక్​బస్టర్​ మూవీ రీరిలీజ్ కాబోతుందని సమాచారం. ఆ సంగతులు..

allu arjun
ఐకాన్​స్టార్ అల్లు అర్జున్

By

Published : Nov 17, 2022, 12:01 PM IST

Allu Arjun Race Gurram Movie Rerelease: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీరిలీజ్​ ట్రెండ్​ నడుస్తోంది. తమ అభిమాన హీరల పాత చిత్రాలను మరోసారి వెండితెరపై చూసి ఫ్యాన్స్​ తెగ సంబరిపడిపోతున్నారు. అయితే నాటి హిట్‌ చిత్రాలు సృష్టించిన ప్రభంజనం గురించి విని, ఆ అనుభూతి పొందాలనే నేటి యువత ఆసక్తే 'రీ రిలీజ్‌'కు కారణంగా నిలుస్తోంది. ఏదైనా సినిమాను టీవీలోనో, ఓటీటీలోనో చూసి 'అరే.. ఈ చిత్రం ఇంత బాగుంది. నా బాల్యంలో విడుదలవటంతో నేను దీన్ని థియేటర్లలో చూడలేకపోయా. వెండితెరపై చూస్తే ఆ మజానే వేరు' అనే ఫీలింగ్‌ పాత సినిమాలను మళ్లీ కొత్తగా మార్చేలా చేస్తోంది. ఇదొక టైమ్‌ ట్రావెల్‌ లాంటిదని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఇటీవలే రీరిలీజ్​ అయిన టాలీవుడ్​ సినిమాలు 'చెన్నకేశవ రెడ్డి', 'వర్షం', 'బాద్​షా', 'పోకిరి' అద్భుతమైన వసూళ్లను అందుకున్నాయి. 'పుష్ప' సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయిన ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్​బస్టర్ మూవీ 'రేసు గుర్రం' మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ చిత్రం రీరిలీజ్​ కానుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బన్నీ​ ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తమ అభిప్రాయాలను నెట్టింట వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' షూటింగ్​లో బిజీబిజీగా గడుపుతున్నారు. 'పుష్ప' సీక్వెల్​గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా దర్శకుడు సుకుమార్​ కూడా మూవీని భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నారు. 'పుష్ప'తో నేషనల్​ క్రష్​గా మారిపోయిన రష్మికనే ఈ సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొడుతుండగా.. అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్​ ఆఫీస్​ ముందుకు ఆందోళన కూడా చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details