తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరోసారి బన్నీ-త్రివిక్రమ్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​.. ఈ సారి మరింత భారీగా!

Allu arjun Trivikram new movie : త్రివిక్రమ్- అల్లుఅర్జున్ కాంబోలో మరో సినిమా ఖరారైంది. ఇప్పటికే కలిసి మూడు సినిమాలు చేసిన వీరిద్దరు.. ఇప్పుడు నాలుగో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు.

By

Published : Jul 3, 2023, 10:34 AM IST

Updated : Jul 3, 2023, 11:10 AM IST

Allu Arjun Trivikram
మరోసారి బన్నీ-త్రివిక్రమ్​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​.. ఈ సారి మరింత భారీగా!

Allu arjun Trivikram new movie : టాలీవుడ్ సక్సెస్​ఫుల్ కాంబినేషన్స్​లో త్రివిక్రమ్- అల్లుఅర్జున్ ఒకటి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అలవైకుంఠపురంలో' చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా 'అలవైకుంఠపురంలో' నేషనల్ వైడ్​గా బ్లాక్ బాస్టర్ హిట్​ అందుకుంది. అలా ఈ కాంబో హ్యాట్రిక్ హిట్​లను అందుకున్నారు. ఈ మూడు చిత్రాలను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్​పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ముగ్గురి కాంబోలో మరో చిత్రం రానుందని ప్రచారం సాగింది. తాజాగా ఈ సినిమా గురించి ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. ఈసారి మరింత భారీగా రెట్టింపు వినోదంతో రానున్నారని తెలుపుతూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తెలిపింది. సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం అందింది. ఇక ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ చేయడం అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లోని పంచ్‌ డైలాగ్​లను సోషల్‌ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అలానే కొత్త సినిమా పోస్టర్, వీడియోను కూడా ట్రెండ్ చేస్తున్నారు.

Alluarjun pushpa 2 movie : ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్‌ 'పుష్ప2' షూటింగ్​తో బిజీగా ఉన్నారు. దీనిని దర్శకుడు సుకుమార్​ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు మొదటి నుంచే అడ్డంకులే ఉన్నట్లు కనిపిస్తోంది. కథలో మార్పులు, షూటింగ్ ఆలస్యం, క్యాస్టింగ్​పై కన్ఫ్యూజన్​.. ఇలా మొత్తంగా ఈ సినిమాపైనే ఓ సందిగ్ధత నెలకొంది. దీనికి తోడు ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఇది పూర్తి చేయకుండా.. త్రివిక్రమ్.. పవన్ సినిమాల వెనకాలే పడుతున్నారని మహేశ్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ ఈ చిత్రం పూర్తవ్వగానే.. అల్లు అర్జున్​తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Last Updated : Jul 3, 2023, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details