తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వైల్డ్​ కాంబో .. అల్లు అర్జున్​ కొత్త సినిమా అనౌన్స్​మెంట్​ వచ్చేసిందోచ్​ - సందీప్ వంగా రెడ్డి అల్లు అర్జున్ సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాను ప్రకటించేశారు. 'అర్జున్​ రెడ్డి' ఫేమ్​ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు

Allu Arjun to headline Bhushan Kumar Sandeep Reddy
మెంటల్ మాస్ కాంబినేషన్ రెడీ

By

Published : Mar 3, 2023, 8:45 AM IST

Updated : Mar 3, 2023, 9:52 AM IST

ఆడియెన్స్​లో భారీ అసక్తిని నెలకొల్పేలా ఇండస్ట్రీలో మాస్-మెంటల్ మాస్ కాంబినేషన్ రెడీ అయింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాను ప్రకటించారు. తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్' సినిమాలతో వరుసగా భారీ హిట్లను అందుకుని సన్షేషన్ క్రియేట్​ చేసిన సందీప్ రెడ్డి వంగాతో ఆయన సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్​ను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నారు.

విషయానికొస్తే.. 'పుష్ప'తో బిగెస్ట్​ బ్లాక్​ బాస్టర్​ అందుకున్న అల్లు అర్జున్​ ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే ఆయన నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తారా, ఎప్పుడెప్పుడు తన కొత్త మూవీని ప్రకటిస్తారా అని అప్పటినుంచి అభిమానులు ఎదురుచూస్తునే ఉన్నారు. ఆయన కూడా ఓ వైపు కథలు వింటూనే.. మరోవైపు 'పుష్ప 2'తో బిజీగా గడుపుతున్నారు. అలా దాదాపుగా ఏడాది నుంచి పుష్ప మేకోవరే మెయిన్​టెయిన్​ చేస్తూ ఆ చిత్రం కోసమే పని చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్​లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అసలే బాలీవుడ్​లో కూడా 'పుష్ప' విజయం సాధించడం వల్ల.. ఉత్తరాది ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి సీక్వెల్​ను గట్టిగానే తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్​ వంగాతో సినిమా ప్రకటించి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చారు బన్నీ. ఇకపోతే బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా చేస్తారని వినికిడి. ఒకవేళ ఇది కూడా పక్కా అయితే.. అల్లు అర్జున్ చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు అవుతుంది.

ఇకపోతే సందీప్​ వంగా చేతిలోనూ రెండు సినిమాలు ఉన్నాయి. 'అర్జున్​ రెడ్డి', 'కబీర్ సింగ్' సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న సందీప్​.. ఆ తర్వాత మహేశ్​ బాబుతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అది సెట్ కాలేదు. ఆ తర్వాత హిందీలో రణ్‌బీర్ కపూర్​తో 'యానిమల్' మూవీ చేశారు. రష్మిక హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్​ కానుంది. దీని తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్​తో భారీ బడ్జెట్​తో 'స్పిరిట్' మూవీ చేయనున్నారు. ఇది ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. మరి ఇది పూర్తయ్యాక అల్లు అర్జున్ సినిమా తెరకెక్కిస్తారేమో చూడాలి. అలా బన్నీ పుష్ప 2, సందీప్​ స్పిరిట్​ అయ్యాకు 2025లో వీరి సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:Balagam Review: దర్శకుడిగా కమెడియన్​ వేణు.. తొలి ప్రయత్నంలో హిట్ కొట్టినట్టేనా?

Last Updated : Mar 3, 2023, 9:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details