తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీలోకి బన్నీ ఎంట్రీ.. ఫస్ట్​ లుక్​ రిలీజ్​ చేసిన 'ఆహా' - ఆహాలో అల్లు అర్జున్ షో

పుష్ప షూటింగ్​లో బిజీగా ఉన్న స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​ త్వరలో డిజిటల్​ ప్లాట్​ఫామ్​లోకి అడుగుపెట్టనున్నారట. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా బన్నీ ఫ్యాన్స్​ కోసం ఓ క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. అదేంటంటే..

allu arjun in aha
allu arjun

By

Published : Mar 16, 2023, 7:08 AM IST

ఓ వైపు పుష్ప సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​ ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్​లో ఉన్నారు. పుష్ప సినిమా తర్వాత ఈ ఐకాన్​ స్టార్​ క్రేజ్​ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఫ్యాన్స్​ తన అప్​కమింగ్​ ప్రాజెక్ట్స్​ పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'.. బన్నీ ఫ్యాన్స్​ కోసం ఓ బిగ్​ సర్​ప్రైజ్​నే ప్లాన్​ చేసింది.

ఇప్పటికే నందమూరి బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే షో తీసుకొచ్చి ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించిన 'ఆహా' ఇప్పుడు అల్లు అర్జున్​ ఫ్యాన్స్​ కోసం ఓ బిగ్గెస్ట్​ సర్​ప్రైజ్​ను ప్లాన్​ చేసింది. ఇదే విషయాన్ని 'ఆహా' బుధవారం సామాజిక మాధ్యమాల్లో అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది.

"అల్లు అర్జున్​ని మీరు మాస్​గా, క్లాస్​గా చూసుంటారు. ఈసారి ఓ బ్లాక్‌ బస్టర్ లుక్​తో ఆహా మీ ముందుకు తీసుకురానుంది. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ కోసం రెడీగా ఉండండి.' అంటూ పోస్ట్​ చేసింది. దీంతో ఫ్యాన్స్​లో ఆసక్తి మరింత ఎక్కువయ్యింది. అయితే బన్నీతోనే ఓ షో రన్​ అవుతోందా లేకుంటే ఆల్రెడీ ఆహాలో రన్​ అవుతున్న షోల్లోనే కనిపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం గురించి సోషల్​ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. దీంతో ఆ పోస్ట్​పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండియన్ ఐడల్​కు గెస్ట్​గా రానున్నారా? లేదా ఏదైనా డ్యాన్స్​ షో చేయనున్నారా.. లేకుంటే ఇంటర్వ్యూ ఇవ్వనున్నారా .. లేక అన్‌స్టాపబుల్​లో ఎంట్రీ ఇవ్వనున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఆహాలో ఇప్పుడు పలు షోలు రన్​ అవుతున్నాయి. 'అన్‌స్టాపబుల్‌', 'డాన్స్​ ఐకాన్‌', 'ఇండియన్‌ ఐడల్‌ 2' లాంటి షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రోగ్రామ్స్​లో గెస్ట్​ అప్పీయరెన్స్​ ఇవ్వనున్నారా లేకుంటే ఏదైనా షో కి జడ్జీగా రానున్నారా లేక తనతోనే ఏదైనా కొత్త షో మొదలవ్వనుందా అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆహా మరో అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇచ్చేవరకు ఎటువంటి క్లారిటీ రాదని అభిమానులు అంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం 'పుష్ప 2​'లో నటిస్తున్నారు. మెదటి పార్ట్​ సక్సెస్​ను ఆస్వాదిస్తున్న చిత్ర యూనిట్​ ఇప్పుడు సీక్వెల్​ చిత్రీకరణలో బిజీ అయిపోయారు. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నింపేసింది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్​కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మలయాళ స్టార్​ హీరో ఫహద్‌ ఫాజిల్‌తో పాటు అనసూయ, సునీల్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఓ రోల్​ చేయనున్నారట.

ABOUT THE AUTHOR

...view details