'పుష్ప'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. గతేడాది విడుదలైన ఈ సినిమాతో మార్కెట్‌లో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో ఆయన్ని తమ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా పెట్టుకునేందుకు పలు వాణిజ్యసంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్‌లకు ప్రకటనకర్తగా వ్యవహరిస్తోన్న ఆయన తాజాగా మరికొన్నింటికి సంతకాలు చేశారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్ డైరెక్షన్స్‌లో ఆయా సంస్థల యాడ్స్ షూట్‌లో ఆయన పాల్గొన్నారు.
న్యూ లుక్‌తో షేక్ చేస్తున్న స్టార్ హీరో.. - allu arjun new look
టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో గుర్తుపట్టలేనంతగా మారారు. బ్రౌన్, వైట్ కలర్ జుట్టు.. చెవి పోగులు, నోటిలో సిగెరెట్టు, స్టైలిష్ కళ్లద్దాలు.. ఇలా మాస్, రఫ్ లుక్‌లో ఆయన కొత్త అవతారం ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ హీరో న్యూలుక్ చూసిన తోటి నటీనటులు సైతం.. ''సార్.. మీరేనా?'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? న్యూ లుక్ కథేంటంటే..?
రెండ్రోజుల క్రితం హరీశ్ శంకర్-బన్నీ కాంబోలో హైదరాబాద్‌లో ఓ యాడ్ షూట్ జరిగింది. ఈ యాడ్ కోసం బన్నీ తన లుక్ మార్చుకున్నారు. ఇందులో ఆయన రింగుల జుట్టు, చెవి పోగులతో రఫ్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోని ఆయన ట్విటర్ వేదికగా షేర్ చేయగా దాన్ని చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బన్నీని గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్ చేశారు. ఇక, నటి రష్మిక సైతం.. ''ఓ మై గాడ్.. అల్లు అర్జున్ సర్.. ఒక్క క్షణం పాటు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను '' అంటూ పోస్ట్ పెట్టారు.
ఇదీ చదవండి: Kriti Shetty: 'అది తింటే.. నా మూడ్ ఇట్టే మారిపోతుంది'