2021లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించిన పుష్ప సినిమా.. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సివిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ లుక్‌తో పాటు ఆయన యాస అభిమానులను ఆకర్షించింది. 2021లో రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలుగొట్టింది. ఎటువంటి ప్రమోషన్లు లేకుండానే బాలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం.. ఏకంగా రూ.100 కోట్లు మేర వసుళ్లు సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని పాత్రలతో పాటు డైలాగ్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప అంటే ఫైర్', అలాగే 'తగ్గేదే లే' అనే డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా రష్యలో కూడా రిలీజై అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ద రూల్స్ తెరకెక్కుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో పాత క్యారెక్టర్లతో పాటు మరిన్ని కొత్త క్యారెక్టర్లు కూడా యాడ్ అవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నటి సాయి పల్లవి కూడా ఓ కెమియో రోల్లో నటించనున్నారట. అందుకు తన కాల్షీట్లోని పది రోజులను కూడా కేటాయించారట. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్‌ను లాంచ్ చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందట.