ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే 'పుష్ప: ది రూల్' మూవీటీమ్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న 'వేరీజ్ పుష్ప' టీజర్‌ను రిలీజ్ చేసింది. అది ఇప్పుడు ఇండియా మొత్తం సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ వీడియో అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇది చూసిన సినీ ప్రియులు, అభిమానులు.. టీజర్ అదిరిపోయిందంటూ సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ సెన్సేషన్ 'పుష్ప 2'నే అని అంటున్నారు.
మొత్తంగా ఈ పుష్ప 2 టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ లోగో.. ఇలా అన్నీ సినిమాపై అంతకుమించి అంచనాలను, అలానే అనుమానాలను పెంచేశాయి. అయితే ఈ వీడియో మొత్తం అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడంటూ అనే పాయింట్‌తోనే సాగింది. చివర్లో.. జైలు నుంచి తప్పించుకున్న పుష్ప రాజ్ ఓ అడవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లు చూపిస్తారు. నైట్ విజన్ కెమెరాలో పులి పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్లే పుష్పను చూపించారు. అయితే అక్కడ అతడు తన మార్క్ స్టైల్లో గడ్డం నిమురుకుంటూ తగ్గేదే లే అంటూ కనపడతాడు. ఆ సమయంలో అతడి చిటికెన వేలు గోరు మాత్రం నైల్ పాలిష్‌తో బారుగా కనిపిస్తోంది. ఇదే ప్రతిఒక్కరి మెదడులో అనుమానాన్ని రేపుతోంది. దీన్ని చూసిన వారందరూ అదొక్కటే ఎందుకు స్పెషల్‌గా చూపించారు అంటా తెగ ఆలోచిస్తున్నారు. దాని గురించే చర్చిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో పుష్ప రాజ్.. శత్రువులను చంపేందుకు మారువేషంలో అమ్మోరులా చూపించారు. ఎవరూ ఊహించని ఈ లుక్‌లో అల్లు అర్జున్ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించారు.