తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Filmfare Awards 2022: అల్లు అర్జున్​ 'పుష్ప' త‌గ్గేదేలే.. ఏడు కేటగిరీల్లో.. - 67వ ఫిలింఫేర్‌ అవార్డులు అల్లుఅర్జున్​

Filmfare Awards 2022: 67వ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఎంతో వేడుకగా జరిగింది. అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' ఈ ఏడాది అత్యధికంగా అవార్డులు సొంతం చేసుకుంది.

filmfare awards
filmfare awards

By

Published : Oct 10, 2022, 8:31 AM IST

Filmfare Awards 2022: దక్షిణ భారత చలన చిత్రరంగంలో విశేషంగా భావించే 'ఫిలింఫేర్‌'అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. కరోనా పరిస్థితులతో గడిచిన కొన్నేళ్లు నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక.. ఈ ఏడాది స్టార్‌ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌కు ఈ ఏడాది ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం వరించింది.

ఈసారి ఫిలింఫేర్‌లో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన టాలీవుడ్‌ చిత్రం 'పుష్ప' హవా నడిచింది. మొత్తం ఏడు విభాగాల్లో ఆ చిత్రం సత్తా చాటింది. తమిళంలో సూర్య కథానాయకుడిగా నటించిన 'సూరారై పోట్రు'.. ఏడు అవార్డులను దక్కించుకుంది.

ఫిలింఫేర్‌ విజేతలు వీరే..!

  • ఉత్తమ చిత్రం: పుష్ప - ది రైజ్
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప - ది రైజ్)
  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప - ది రైజ్‌)
  • ఉత్తమ నటి: సాయిపల్లవి (లవ్‌స్టోరీ)
  • ఉత్తమ సహాయనటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
  • ఉత్తమ సహాయనటి: టబు (అల వైకుంఠపురములో)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప - ది రైజ్)
  • ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (జాను) (లైఫ్‌ ఆఫ్‌ రామ్‌)
  • ఉత్తమ గాయకుడు: సిద్ద్‌ శ్రీరామ్‌ (పుష్ప ది రైజ్‌ - శ్రీవల్లి)
  • ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్‌ (పుష్ప ది రైజ్‌ - ఊ అంటావా మావ)
  • విమర్శకుల ఉత్తమ నటి: సాయిపల్లవి (శ్యామ్‌సింగ్‌రాయ్‌)
  • విమర్శకుల ఉత్తమ నటుడు: నాని (శ్యామ్‌సింగరాయ్‌)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: శేఖర్‌ మాస్టర్‌ (అల వైకుంఠపురములో - రాములో రాములా)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప - ది రైజ్)
  • ఉత్తమ నూతన నటి: కృతిశెట్టి (ఉప్పెన)
  • ఉత్తమ నూతన నటుడు: వైష్ణవ్‌ తేజ్‌ (ఉప్పెన)

తమిళం:

  • ఉత్తమ చిత్రం: జై భీమ్‌
  • ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (సూరారైపోట్రు)
  • ఉత్తమ నటుడు: సూర్య (సూరారైపోట్రు)
  • ఉత్తమ నటి: లిజోమోల్‌ జోసీ (జై భీమ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు : పసుపతి (సార్పట్ట)
  • ఉత్తమ సహాయనటుడు: ఊర్వశి (సూరారైపోట్రు)
  • ఉత్తమ ఆల్బమ్‌: జీవీ ప్రకాశ్‌ (సూరారైపోట్రు)
  • ఉత్తమ గేయ రచయిత‌: అరివు (సార్పట్ట)
  • ఉత్తమ గాయకుడు: క్రిస్టిన్‌ జాస్‌, గోవింద్‌ వసంత (సూరారైపోట్రు)
  • ఉత్తమ గాయని : ధీ (సూరారైపోట్రు)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: దినేష్‌ కుమార్‌ (మాస్టర్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: నికిత్‌ (సూరారైపోట్రు)

ABOUT THE AUTHOR

...view details