తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

allu arjun national award 2023 : బన్నీ ఇంటికి 'పుష్ప' టీమ్... అల్లు అర్జున్​ను చూడగానే సుక్కు ఎమోషనల్ - జాతీయ ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్

allu arjun national award 2023 : జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. అల్లుఅర్జున్​ను ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఈ సందర్భంగా పుష్ప మూవీ టీమ్.. బన్నీ ఇంటికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

allu arjun national award 2023
allu arjun national award 2023

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 10:25 PM IST

Allu Arjun National Award 2023 : 'పుష్ప ద రైజ్' సినిమాకుగాను అల్లు అర్జున్​కు జాతీయ అవార్డు దక్కడం వల్ల అల్లు ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. 69 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు అందని ద్రాక్షగా ఉన్న ఉత్తమ నటుడి అవార్డును బన్నీ సాధించి రికార్డు సృష్టించారు. ఇక బన్నీకి నేషనల్ అవార్డు రావడం వల్ల.. తన ఫ్యాన్స్​ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని సంబరాలు చేసుకున్నారు.

కాగా బన్నీకి దక్కిన పురస్కారానికి పుష్ప దర్శకుడు సుకుమార్​తో సహా, మూవీ టీమ్ ఆయన ఇంటి చేరుకొని బన్నీకి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్.. బన్నీని హగ్​ చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్​లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

గంగోత్రి నుంచి పుష్ప వరకు..గంగోత్రి సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు అల్లుఅర్జున్. అప్పట్లో ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఇక సుకుమార్ డైరెక్షన్​లో 'ఆర్య' సినిమాతో యూత్​లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లుఅర్జున్. తర్వాత వివి వినాయక్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కించిన 'బన్ని' చిత్రంతో మాస్ ఆడియెన్స్​ను సైతం మెప్పించారు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో బన్నీగా మారిపోయారు ఆల్లుఅర్జున్. ఇక వరుసగా హ్యాపీ, దేశముదురు, ఆర్య 2, బద్రీనాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు.

కెరీర్​లోనే పెద్ద విజయం.. 2021లో పుష్ప సినిమాతో అల్లు అర్జున్​పాన్ఇండియా స్టార్​గా మారిపోయారు. సినిమాలో తగ్గేదెలే అంటూ తన మేనరిజంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు బన్నీ. ఈ సినిమా బన్నీ కెరీర్​లో పెద్ద విజయంగా చెప్పవచ్చు. మునుుపెన్నడూ లేని విధంగా బన్నీ.. ఈ సినిమాలో మాస్ లుక్​లో కనిపించి ఫ్యాన్స్​కు ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు (సుమారు రూ. 300 కోట్లు పైన) వసూల్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details