తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షారుక్​ సినిమాలో అల్లు అర్జున్.. 'మల్టీ​ స్టార్'​ ప్లాన్​ వేసిన అట్లీ! - అల్లు అర్డున్​ జవాన్​ సినిమా అతిథి పాత్ర

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్​ ఖాన్.. ఇటీవల విడుదలైన 'పఠాన్​' సక్సెస్​ను ఎంజాయ్​ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో ప్రముఖ దర్శకుడు అట్లీ డైరెక్షన్​ తెరకెక్కుతున్న 'జవాన్​' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ​ఈ సినిమాలో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు..

allu arjun shah rukh khan
allu arjun shah rukh khan

By

Published : Feb 13, 2023, 8:23 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ నటించిన 'పఠాన్​' సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఆయన కెరీర్​లోనే అత్యధిక కలెక్షను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం షారుక్​ ఈ సినిమా విజయాన్ని సెలబ్రెట్​ చేసుకుంటున్నారు. ఈ జోష్​లోనే తర్వాత మూవీ పనులు మొదలు పెట్టేశారు. ప్రముఖ దర్శకుడు అట్లీతో 'జవాన్​' చిత్రాన్ని పట్టాలెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

బాలీవుడ్​ కింగ్​కాంగ్​ షారుక్‌ ఖాన్​ సరసన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. 'జవాన్‌'లో అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించిందనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒకవేళ బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరిస్తే బాలీవుడ్​తో పాటు.. ఇటు తెలుగులోనూ సినిమా సూపర్​ హిట్‌ అవుతుందని అట్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇంకా రాలేదు. కానీ, ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కాగా, ప్రస్తుతం అల్లుఅర్జున్‌ 'పుష్ప2' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్‌లో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే ఈ షూటింగ్‌లో రష్మిక పాల్గొననుంది.

ABOUT THE AUTHOR

...view details