తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డాడీ కన్నా ముందే చిరంజీవి సినిమాలో నటించిన బన్నీ.. ఆ మూవీ తెలుసా? - అల్లుఅర్జున్​ చిరంజీవి సినిమాలు

పాన్​ఇండియా స్టార్ అల్లుఅర్జున్​.. హీరో కాక ముందు చిరంజీవి నటించిన డాడీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందే చిరు నటించిన మరో చిత్రంలోనూ బన్నీ కనిపించారు. ఆ చిత్రమేంటో తెలుసా?

allu arjun chiranjeevi movie
డాడీ కన్నా ముందే చిరంజీవి సినిమాలో నటించిన బన్నీ.. ఆ మూవీ తెలుసా?

By

Published : Nov 26, 2022, 9:48 PM IST

పుష్పతో ఐకాన్​స్టార్​గా దేశవ్యాప్తంగా క్రేజ్​ తెచ్చుకున్న అల్లుఅర్జున్​ పాన్​ఇండియా స్టార్​గా ఎదిగారు. పక్కా ఊర మాస్ లుక్‏లో బన్నీ నటనకు ఇండియన్​ బాక్సాఫీస్​ షేక్ అయింది. అయితే గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్​.. అంతకుముందే పలు చిత్రాల్లో నటించాడన్న సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ ఒకటి. చిరు వద్ద డ్యాన్స్​ నేర్చుకునే కుర్రాడిగా కనిపించారు. అయితే ఈ సినిమా కన్నా ముందు చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించారు. ఆ సినిమాలెంటో తెలుసుకుందాం..

డాడీ సినిమా కంటే ముందు బన్నీ.. చిరు నటించిన ఓ సినిమాలో ఆయన మేనల్లుడిగా కనిపించారు. ఆ చిత్రమే విజేత. 1985 లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఆ తర్వాత 1986లో కమల్ హసన్, కె. విశ్వనాథ్ కాంబోలో వచ్చిన స్వాతిముత్యం చిత్రంలోనూ నటించారు. కమల్ హసన్ మనవళ్లలో ఒకరిగా బన్నీ కనిపించారు.

ఇక గంగోత్రి సినిమాతో హీరోగా మారిన బన్నీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో ఒక్కసారిగా పాన్​ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:జక్కన్నపై లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ కథనం... మధ్యలో పవన్‌ మూవీ గురించి ట్వీట్​!

ABOUT THE AUTHOR

...view details