Allu Arjun Atlee Anirudh Movie :'పుష్ప ది రైజ్' సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం ఆయన 'పుష్ప ది రూల్' సినిమా షూటింగ్‌తో బిజీగా గడిపేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా విడుదల తేదీని 2024 ఆగస్ట్ 15గా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తారన్నది టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఆయన త్రివిక్రమ్‌తో ఓ సినిమా కూడా ప్రకటించారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో.. బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని ఇన్సైడ్ టాక్ వినిపించింది. అయితే వీరి కాంబినేషన్ గురించి ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ అల్లు అర్జున్ తాజాగా చేసిన ట్వీట్‌తో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ - అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక 'జవాన్' సినిమా సక్సెస్‌పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన బన్నీ.. హీరో షారుక్‌తో పాటు నటీనటులు విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, దర్శకుడు అట్లీని కొనియాడారు.