తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగా వేడుకల్లో అర్హ సందడి - దొరికిన బుజ్జి ఫ్రెండ్! - అల్లు అర్హ లేటెస్ట్ వీడియో

Allu Arha Sankranthi Celebrations : ఇటీవలే మెగాఇంట సంక్రాంతి సంబరాలను గ్రాండ్​గా చేశారు. అటు అల్లు ఫ్యామిలీతో పాటు ఇటు మెగా ఫ్యామిలీ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ పార్టీలో అల్లు అర్హకు ఓ బుజ్జి ఫ్రెండ్​ దొరికింది.

Allu Arha Sankranthi Celebrations
Allu Arha Sankranthi Celebrations

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 11:12 AM IST

Allu Arha Sankranthi Celebrations : పండుగ వచ్చిందంటే ఇళ్లంతా సందడి సందడిగా మారిపోతుంటుంది. చిన్న పెద్ద అందరూ ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా తమ పండుగ వాతవారణాన్ని కెమెరాలో బంధించి నెట్టింట అప్​లోడ్​ చేస్తుంటారు. తమ అభిమానులుకు విషెస్ చెప్తూనే పండుగ ముచ్చట్లను పంచుకుంటుంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ కూడా ఈ పండుగను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయా స్టార్స్​ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక అవి వచ్చిన కొద్ది క్షణాల్లోనే నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్యూట్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

Allu Arjun Klinkaara Video : సాధరణంగా అల్లు అర్హ ముద్దు ముద్దు మాటలకు నెట్టింట సూపర్ క్రేజ్ ఉంది. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్​లో ఈ చిన్నారి చేసే సందడి అంతా ఇంతా కాదు. అలా సంక్రాంతి సంబరాల్లోనూ సందడి చేసిన ఈ క్యూటీ మెగా ప్రిన్సెస్​ క్లీంకారతో ఆడుకుంటూ కనిపించింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరూ ఎంతో క్యూట్​గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతన్నారు. అలా అర్హకు క్లీంకార రూపంలో మరో బుల్లి ఫ్రెండ్ దొరికిందంటున్నారు.

నాలుగు రోజుల నుంచి మెగా ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మెగా- అల్లు ఫ్యామిలీ మెంబర్స్​ అందరూ బెంగళూరులోని రామ్‌ చరణ్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకొని అక్కడ ఈ పండుగను గ్రాండ్​గా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫ్యాన్స్​కు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్​ ఓ ఫొటోను షేర్‌ చేశారు. "పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!" అని చిరు రాసుకొచ్చారు. ఇందులో మెగా కుటుంబంతో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన అందరూ ఉండడంతో నెటిజన్ల, అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. ఇక చిరుతో పాటు మిగతా మెగా హీరోలు కూడా ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసి సందడి చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

అ‍ల్లు అర్హ యోగా స్టంట్​.. 'ఓ మై గాడ్'​ అంటోన్న డాడీ

ABOUT THE AUTHOR

...view details