బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు '18 పేజెస్' చిత్రబృందం. సినిమా విజయం సాధించడంతో శనివారం రాత్రి ఇండస్ట్రీకి చెందిన పలువురికి చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ పార్టీ ఇచ్చింది. ఇందులో భాగంగా నటి అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ డ్యాన్స్ చేసి అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సక్సెస్ పార్టీలో అనుపమతో స్టెప్పులేసిన అల్లు అరవింద్.. వీడియో చూశారా? - అల్లు అరవింద్ సుకుమార్ వార్తలు
'18 పేజెస్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు నిర్మాత అల్లు అరవింద్. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పార్టీలో డ్యాన్స్ చేసి అలరించారు.
allu-aravind-and-sukumar-dance-at-18-pages-success-party
నిఖిల్- అనుపమ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం '18పేజెస్'. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. మనసు హత్తుకునే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మితమైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా జరిగిన సెలబ్రేషన్స్‌లో చందు మొండేటి, వశిష్ట, ప్రియాంక జవాల్కర్, ప్రియా వడ్లమాని తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.