తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాంది' కాంబో రిపీట్​.. ఇంట్రెస్టింగ్​ పోస్టర్​తో అల్లరినరేశ్ కొత్త సినిమా - అల్లరినరేశ్ నాంది సినిమా

నటుడు అల్లరినరేశ్​ తన 60వ సినిమాను ప్రకటించారు. 'నాంది' చిత్రంతో తనకు సూపర్​హిట్​ ఇచ్చిన దర్శకుడు విజయ్​ కనకమేడలతో మూవీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా నటించిన మల్టీస్టారర్‌ బాలీవుడ్‌ చిత్రం 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' టీజర్​ పోస్టర్స్​ రిలీజై సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Alllarinaresh Nandi movie combo repeat
ఇంట్రెస్టింగ్​ పోస్టర్​తో అల్లరినరేశ్ కొత్త సినిమా

By

Published : Jun 27, 2022, 4:04 PM IST

Naresh New movie: 'నాంది' సినిమాతో మంచి సక్సెస్​తో పాటు తన నటనకు ప్రశంసలు అందుకున్న నటుడు అల్లరినరేశ్​.. మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. తన 60వ సినిమాను నాంది దర్శకుడు విజయ్​ కనకమేడలతో చేయనున్నట్లు తెలిపారు. సోషల్​మీడియా వేదికగా ఓ పోస్టర్​ను పోస్ట్​ చేశారు. . 'షాడో ఆఫ్ హోప్' అని క్యాప్షన్​ రాసుకొచ్చారు. ఈ పోస్టర్​ ఆసక్తికరంగా ఉంది. సంకెళ్లు ఉన్న రెండు చేతులను.. గోడపై పక్షి నీడలా కనిపించేలా డిజైన్​ చేశారు. ఇక ఈ చిత్రాన్ని 'కృష్ణార్జున యుద్ధం', 'మజిలీ', 'గాలి సంపత్', 'టక్ జగదీష్' చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్స్​ను ప్రకటించనున్నారు. కాగా, నరేశ్​ ప్రస్తుతం.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా చేస్తున్నారు. ఇది ఆదివాసీల ఇతివృత్తంతో సాగే చిత్రం. కొంతకాలం క్రితం చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ అందరీ దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్​ పూర్తికాగానే.. కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నరేశ్ భావిస్తున్నారు.

అల్లరినరేశ్ కొత్త సినిమా

Ek Villan returns teaser poster: జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా నటించిన మల్టీస్టారర్‌ బాలీవుడ్‌ చిత్రం 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌'. 2014లో సిద్ధార్థ్‌ మల్హోత్రా, శ్రద్ధాకపూర్‌, రితీష్‌దేశ్‌ముఖ్‌లు నటించిన 'ఏక్‌ విలన్' చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కించారు. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తైంది. తాజాగా ఈ చిత్రంలోనే పాత్రలకు సంబంధించిన టీజర్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. సినిమా జులై 29న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపింది.

జాన్​ అబ్రహాం
అర్జున్​ కపూర్​
తారా సుతారియా
దిశాపటానీ

ఇదీ చూడండి: క్రికెటర్​తో లవ్​.. ప్రియాంక జావల్కర్​ ఏమన్నదంటే?

ABOUT THE AUTHOR

...view details