రీసెంట్గా అల్లరినరేశ్-గోపిచంద్.. మే 5న 'ఉగ్రం', 'రామబాణం' చిత్రాలతో థియేటర్లలో ఆడియెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు మిక్స్డ్ టాక్‌తో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాయి. ఇంకా చెప్పాలంటే గోపిచంద్ 'రామబాణం'తో పోలిస్తే 'ఉగ్రం'కు కాస్త బెటర్ టాక్ వచ్చిందనే చెప్పాలి. తాజాగా ఈ రెండు సినిమాల ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
'నాంది' లాంటి సక్సెస్ ఫుల్ కాంబోలో 'ఉగ్రం' తెరకెక్కడం వల్ల.. రిలీజ్‌కు ముందు చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి. మొదటి రోజు నెగటివ్ టాక్ వినపడలేదు. మంచి ప్రయత్నమే చేశారంటూ కాస్త టాక్ వినిపించింది. నరేశ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కాస్త డీలా పడిందనే చెప్పాలి. ఎందుకంటే.. వరల్డ్‌వైడ్‌గా రూ.8కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బరిలో దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 5.75 కోట్ల గ్రాస్.. 2.62 కోట్ల షేర్‌ను అందుకుందట.ఐదో రోజు ఈ చిత్రానికి 0.5కోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో నరేశ్ పోలీస్ ఆఫీసర్‌గా సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపించారు. మిర్నా మేనన్, ఇంద్రజ, శరత్ లోహితాస్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, మణికంఠ వారణాసి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది కలిసి చిత్రాన్ని నిర్మించారు.