Allarinaresh Itlu Maredumilli Prajanikam movie teaser: నటుడు అల్లరినరేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఆనంది కథానాయిక. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. 'ఇవన్నీ ఆదివాసీల గ్రామాలు. వీళ్లలో ఎక్కువమంది జీవితంలో ఓటు వేయని వాళ్లే ఎక్కువ', 'సాయం చేస్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు.. మీరు మనుషులు అయితే సాయం చేయండి', '90 కిలోమీటర్ల మేర అడవి, 150 కిలోమీటర్ల చుట్టుకొలత.. అక్కడికి వెలితే ఎవరూ వెనక్కి తిరిగి రారు', '25 కిలోమీటర్లు అవతలికి వస్తే గానీ.. వీళ్లెలా బతుకున్నారో మనకే తెలియలేదు. వీళ్లని చూస్తే జాలి పడాలో బాధపడాలో తెలియట్లేదు' అంటూ సంభాషణలతో సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రంలో అల్లరినరేశ్ దెబ్బలు తింటూ కనిపించారు. ఆదివాసీల ఇతివృత్తంతో సాగే ఈ చిత్రంలో.. అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు. దీనిని జీ స్టూడియోస్, హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే.. నాంది సినిమాతో తనకు సూపర్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో తన 60వ చిత్రం చేయనున్నారు.
Parampara webseries season 2 teaser: గతేడాది నెటిజన్లను అమితంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో 'పరంపర' ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పుడు కొనసాగింపు రానుంది. 'పరంపర2'గా వస్తున్న ఈ భాగం జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. నవీన్ చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్, ఆకాంక్షసింగ్, ఇషాన్ వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా సీజన్-2కి సంబంధించి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా?' వంటి విషయాలకు 'పరంపర' సమాధానాలు లభించాయి. మరి కొత్త సిరీస్‌లో ఆధిపత్యపోరు ఎలా ఉంటుందో చూడాలి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు.