యంగ్‌టైగర్ ఎన్టీఆర్-దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా 'ఎన్టీఆర్ 30'. ప్రస్తుతం ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఏ అప్టేడ్ ఇవ్వలేదు. అభిమానుల్లో ఈ సినిమా పట్టలెక్కనుందో లేదో అనే సందేహాలు మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ అంటూ సోషల్‌మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు.
NTR 30 షూటింగ్ ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే! - ఎన్టీఆర్ 30 ప్రారంభ తేది
యంగ్‌టైగర్ ఎన్టీఆర్-దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా 'ఎన్టీఆర్30'. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మార్చిలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.
కాగా, దీనిపై ఇటీవల జరిగిన 'అమిగోస్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పందించి ఫ్యాన్స్‌పై సీరియస్ అయ్యారు. అనంతరం త్వరలోనే అప్డేట్ వస్తుందని చెప్పారు. అయితే, ఫిబ్రవరి 23న పూజ వేడుకతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మార్చి 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా 5 ఏప్రిల్ 2024లో విడుదలవుతుందని ఇది వరకే దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోందంటూ ఊహాగానాలు వినబడుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.