తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వైష్ణవ్​తేజ్​పై చిరంజీవి సీరియస్​, ఏమైందంటే

తొలి సినిమాతోనే సూపర్​హిట్​ను అందుకున్న మెగాహీరో వైష్ణవ్​ తేజ్​ ప్రస్తుతం కెరీర్​లో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఆయనపై మెగాస్టార్​ చిరంజీవి సీరియస్​ అయ్యారు. ఎందుకంటే.

chiru and vaishnav
chiru and vaishnav

By

Published : Aug 24, 2022, 12:34 PM IST

Updated : Aug 24, 2022, 12:44 PM IST

Megastar chiranjeevi fires on vaishnav tej: ఉప్పెనలో 'ఆసీ'గా తనదైన నటనతో ఆకట్టుకున్న యువ హీరో వైష్ణవ్​ తేజ్​. ఒకప్పుడు చిరంజీవీ మేనల్లుడు, సాయి ధరమ్​ తేజ్​ తమ్ముడిగా మాత్రమే సుపరిచితమైన ఆయన​, 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌'తో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మూడో చిత్రం 'రంగ రంగ వైభవంగా' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గిరీశయ్యాతో పాటు వైష్ణవ్​ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో తన సినీ కెరీర్​లో జరిగిన కొన్ని సంఘటనలు, తన కుటుంబం గురించి విషయాలను అలీతో పంచుకున్నారు.

'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌'తో బాలనటుడిగా పరిచయమయ్యాను. ఆ సినిమాలో నా పాత్రకు ఎలాంటి హావభావాలు ఉండవు. కేవలం కుర్చీలో కూర్చొని ఉండటమే. అయితే ఓ సీన్‌లో నేను నవ్వేశాను. అప్పుడు పెదమామయ్య (చిరంజీవి) సీరియస్‌ అయ్యారు. మా కుటుంబం మొత్తం ఒకే చోట కలిసినప్పుడు చిరు మామ ఓరేయ్‌ అని పిలిస్తే చాలు.. మేమంతా పలుకుతాం. ఇక, నేను హీరోగా తెరంగేట్రం చేసిన 'ఉప్పెన' స్క్రిప్ట్‌ని మొదట నేనూ, నా స్నేహితులం విన్నాం. సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు మామయ్యని ప్రత్యేకంగా కలిసి స్టోరీ చెప్పారు. ఆయన వెంటనే.. 'ఐడియా బాగుంది. సినిమా చేయండి' అని అన్నారు.

అనంతరం 'ఉప్పెన' షూట్‌లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారాయన. " ఉప్పెన చేస్తున్నప్పుడు ఓ సీన్‌లో కృతిశెట్టితో.. 'నీకో మాట చెప్పాలి బేబమ్మ' అని నేను కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాలి. ఎందుకో తెలియదు ఆ క్షణం నాకు మాటలు రాలేదు. ఎమోషన్స్‌ పండించలేకపోయా. దాదాపు 20 టేక్స్‌ పైనే తీసుకున్నాను. ఆ సీన్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అందరి సమయాన్నీ.. డబ్బునీ వృథా చేస్తున్నా అనిపించింది. ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు వచ్చేశాయి. ఇక, ఈసినిమాలో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఉంటుంది. అది చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతమంది ముందు ఎలా చేయాలా? అనిపించింది" అని వైష్ణవ్‌ తెలిపారు. ఇక, పవన్‌కల్యాణ్‌ నటించిన 'తమ్ముడు', 'బద్రి' చిత్రాలను తాను దాదాపు 120 సార్లు చూసినట్లు చెప్పారు.

Last Updated : Aug 24, 2022, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details