ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి చిత్రపరిశ్రమలో గొప్ప పేరును సొంతం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. దర్శకుడిగానే కాకుండా నిర్మాత, రచయిత, నటుడిగానూ ఆయన దక్షిణాది వారికి సుపరిచితులు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.
కథ నచ్చినా కమల్‌హాసన్ మూవీకి నో చెప్పిన ప్రొడ్యూసర్స్, ఎందుకంటే - కమల్‌హాసన్ పుష్పకవిమానం
కథ నచ్చినా.. దిగ్గజ నటుడు కమల్‌హాసన్ నటించిన ఓ సినిమాను నిర్మించడానికి మొదట ఏ నిర్మాత ముందుకు రాలేదు. కథ నచ్చినా కుదరదని పరోక్షంగా చేతులెత్తేశారు. ఎందుకంటే
"శారీరకంగా నా వయసు 92.. మానసికంగా 25" అంటూ సంగీతం నవ్వులు పూయించారు. 'మాయబజార్'కు కో డైరెక్టర్‌గా పనిచేశారా? అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారా? అని ప్రశ్నించగా.. 'అసిస్టెంట్‌గా అప్పుడే నా ప్రయాణం మొదలైంది' అని చెప్పారు. ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా చూడటం ఒక అద్భుతమని అన్నారు. అనంతరం కమల్‌హాసన్ 'పుష్పక విమానం' సినిమా గురించి మాట్లాడుతూ.. "కథ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. కానీ, ఆ చిత్రాన్ని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే బాగుండు అనుకున్నా" అని ఆయన వివరించారు.
ఇదీ చూడండి:స్టేజ్‌పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన కమెడియన్ ధనరాజ్