తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ, కిడ్నాప్​ చేస్తానంటూ

ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సంగతులివీ.

Alitho saradaga Pv Sindhu
ఆలీతో సరదాగా పీవీ సింధు

By

Published : Aug 20, 2022, 2:24 PM IST

Updated : Aug 20, 2022, 3:05 PM IST

Alitho saradaga Pv Sindhu promo ఎంతోమంది సినీ ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాక్‌ షో 'ఆలీతో సరదాగా'. అయితే ఈ వారం ఎపిసోడ్‌లో నాన్ ఫిల్మ్​ సెలబ్రిటీ, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అతిథిగా వచ్చేసి సందడి చేశారు. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తకిరమైన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇంకా ఆలీతో కలిసి బ్యాడ్మింటన్​ ఆడారు. మొత్తంగా ఇద్దరి సంభాషణలతో ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

ఈ ప్రోమోలో టాలీవుడ్​లో స్టార్ హీరో ప్రభాస్‌ అంటే తనకెంతో ఇష్టమని, మంచి స్నేహితుడని చెప్పిన సింధు.. ఇష్టమైన కమెడియన్ ఆలీ అని పేర్కొంది. ఈ క్రమంలోనే 'సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?' అని అలీ ప్రశ్నించగా.. "ఏమో.. నా బయోపిక్కే ఉండొచ్చేమో ఎవరికి తెలుసు?" అని నవ్వులు పూయించింది.

ఇప్పటి వరకూ తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని సింధు చెప్పింది. ఇంట్లో వాళ్లందరూ ఆ ప్రేమ లేఖలు చదువుతారని తెలిపింది. గతంలో ఓ 70 ఏళ్ల వ్యక్తి ఇలాగే లేఖ రాశాడని, తనకిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్‌ చేస్తానని ఆ లేఖలో బెదిరించాడని చెప్పుకొచ్చింది.

ఇంకా దేశంపై తనకున్న ప్రేమను తెలియజేసింది. "ఏదైనా పోటీల్లో గెలుపొంది పతకం తీసుకున్న సమయంలో అక్కడ మన జాతీయ గీతాన్ని వినిపిస్తుంటారు. ఆ క్షణం నాకెప్పుడూ కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ వినిపించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది" అని చెప్పింది. అనంతరం తన ఆట తీరుపై వచ్చిన విమర్శలపై ఆమె స్పందించారు. "నేను ఏదైనా పోటీలో విఫలమైనప్పుడు.. 'ఎందుకలా ఆడుతున్నావ్‌? అంతకుముందు గేమ్‌లో ఆడినట్లు ఇక్కడ కూడా ఆడొచ్చు కదా' అని చెబుతుంటారు. వాళ్ల మాటలు విన్నప్పుడు.. 'నువ్వు వచ్చి ఆడు.. నీక్కూడా తెలుస్తుంది’ అని చెప్పాలనిపిస్తుంది' అని సింధు అన్నారు. చివరగా ఓ ప్రముఖ అకాడమీ నుంచి బయటకు వెళ్లిపోవడంపై ఆమె మాట్లాడుతూ.. "అక్కడ నాకు కొన్ని విషయాలు నచ్చలేదు" అని అన్నారు.

ఇదీ చూడండి: స్విమ్మింగ్​ పూల్​లో చొక్కాలేకుండా మహేశ్‌.. ఫొటోస్​ వైరల్​

Last Updated : Aug 20, 2022, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details