సంగీతం నేర్చుకునే విషయంలో తన తండ్రి పండితుడని, తాను పరమ శుంఠనని సంగీత దర్శకుడు మణిశర్మ నవ్వుతూ అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు.
చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఎస్పీని అందుకే తప్పించా: మణిశర్మ - ఆలీతో సరదాగా మణిశర్మ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
చిరంజీవికి ఇష్టంలేకపోయినా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని తప్పించి ఉదిత్ నారాయణతో 'రామ్మా చిలకమ్మా' ఎందుకు పాడించాల్సి వచ్చిందో చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ.
చిరంజీవికి ఇష్టలేకపోయినా ఎస్పీని అందుకే తప్పించా
చిరంజీవికి ఇష్టంలేకపోయినా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని తప్పించి ఉదిత్ నారాయణతో 'రామ్మా చిలకమ్మా' ఎందుకు పాడించాల్సి వచ్చిందో చెప్పారు. ఏఆర్ రెహమాన్, తానూ కలిసి కీబోర్డ్ ప్లేయర్‌లుగా పనిచేసినట్లు మణిశర్మ తెలిపారు. తమన్ వచ్చిన తర్వాత మణిశర్మ అక్కర్లేదు, అనుకునేవాళ్లకు మీ సమాధానం ఏంటి? అని అడగ్గా, 'కాలమే సమాధానం' అని అన్నారు.
ఇదీ చూడండి:'నేను కథలు రాయను.. దొంగిలిస్తాను'.. జక్కన్న తండ్రి షాకింగ్ కామెంట్!