తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శుభశ్రీకి తాళి కట్టి.. మామకు షాకిచ్చిన ఆలీ - ఆలీతో సరదాగా

అలనాటి నటి శుభశ్రీకి ప్రముఖ కమెడియన్​ అలీ తాళి కట్టారట. ఆ తాళి కట్టిన ఫొటో చూసి.. ఆయన మామగారు, భార్య షాకయ్యారట. ఇంతకీ అసలేం జరిగింది?

alitho-saradaga
అలీ

By

Published : Apr 8, 2022, 10:54 PM IST

Updated : Apr 8, 2022, 11:06 PM IST

alitho saradaga latest promo: తాను ఒకప్పుడు రెబల్‌గా ఉన్నానని, ఇప్పుడు సాఫ్ట్‌ అండ్‌ కూల్‌గా మారానని శుభశ్రీ అన్నారు. ‘అందరూ అందరే’, ‘పోకిరి రాజా’, ‘పెదరాయుడు’, ‘మా ఆవిడ కలెక్టర్‌’, ‘పెద్దన్నయ్య’, ‘అత్తా.. నీ కొడుకు జాగ్రత్త’, ‘అల్లరి పెళ్లికొడుకు’ తదితర చిత్రాలతో అలరించిన నటి ఈమె. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. సినిమా సంగతులతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అసలు పేరు భారతీ పాండే కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక శుభశ్రీ అయ్యానన్నారు. ఏడో తరగతి వరకు చదువుకున్నానని, బడికి వెళ్లకుండా ఉండేందుకే సినిమాల్లోకి వచ్చానని (నవ్వులు) తెలిపారు. 'ఎంగ తంబి' అనే తమిళ చిత్రంతో నటిగా కెరీర్‌ ప్రారంభమైందని చెప్పారు.

'అల్లరి పెళ్లికొడుకు' సినిమా సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు . ఆ సినిమాలో శుభశ్రీని ఆలీ పెళ్లి చేసుకునే పాత్ర ఉంటుంది. ఈ క్రమంలో తాళి కట్టే ఫొటో ఒకటి బయటికి రాగా.. ఓ మ్యాగజైన్​లో.. ఆలీ, శుభశ్రీకి నిజంగా పెళ్లైనట్లు రాశాడట. ఆ మ్యాగజైన్​ తన మామగారు కొని చూశాడని, అప్పుడు తన భార్య కూడా పక్కన ఉందని చెప్పాడు అలీ.

శుభశ్రీ భర్త గురించి వివరిస్తూ.. ‘'నేను స్నేహితులతో కలిసి ఆడుకునే సమయంలో వచ్చి నన్ను ప్రేమించేవారు. నాకు ఆయనిచ్చిన మొదటి బహుమతి డైమండ్‌ రింగ్‌. నిజం చెప్పాలంటే ఆయన నా తమ్ముడిలా కనిపిస్తారు. అంత సన్నగా ఉంటారు మరి (నవ్వుతూ..). కసరత్తులు చేయమని నన్ను రోజూ తిడుతుంటారు (సరదాగా..). నాకేమో బద్ధకం' అని చెప్పుకొచ్చారు. పూర్తి ఎపిసోడ్‌ ఏప్రిల్‌ 11న రాత్రి 9:30 గం.లకు ‘ఈటీవీ’లో ప్రసారంకానుంది. ప్రస్తుతం.. ప్రోమో విడుదలై అలరిస్తోంది.

ఇదీ చూడండి:ఊటీలో 'ది ఘోస్ట్'​.. రొమాంటిక్​గా నాగశౌర్య.. 'క్రేజీ' టైటిల్​తో ఆది

Last Updated : Apr 8, 2022, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details