F3 Poojahegdey party song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో... వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం 'ఎఫ్3'. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్, పూజాహెగ్డేలపై 'లైఫ్ అంటే ఇట్లా ఉండాలా' అనే ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. తాజాజా ఆ గీతానికి సంబంధించిన ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వెంకటేశ్, వరుణ్ పోటీగా స్టెప్పులేయగా.. పూజా గ్లామర్ హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగించేలా ఉంది. ఇక ఈ పాటను రాహుల్ సిప్లి గంజ్, గీత మాధురి ఆలపించగా, కాసర్ల శ్యామ్ సంగీతం అందించారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ గీతం పార్టీ సాంగ్‌గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని సినీ వర్గాలు తెలిపాయి.
Alitho saradaga F3 movie team: నటుడు సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడి... ఆలీతో కలిసి సందడి చేశారు. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్' చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సునీల్, అనిల్.. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి, పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో సునీల్, ఆలీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎంత ఫన్ ఉండబోతుందో ఈ వేదికపై చర్చించారు. 'అనిల్ అండ్ సునీల్' అని ఏదైనా సినిమాకు టైటిల్ పెడితే బాగుంటుందంటూ ఆలీ కామెడీ పండించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభూతినిచ్చందని సునీల్ పేర్కొన్నారు. బస్ డిపోను తలపించేలా కారవాన్‌లు ఉండేవని, అంతమంది నటీనటులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 'ఎఫ్ 4' ఉంటుందా అని ఆలీ అడగ్గా "ప్రేక్షకులకు వినోదం పంచడమే మన విధి. కచ్చితంగా ఉంటుంది" అని అనిల్ సమాధానమిచ్చారు. బాలకృష్ణతో తాను తెరకెక్కించే చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. ఈ పూర్తి నవ్వుల రైడ్ 'ఈటీవీ'లో మే 23 రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.
Major song promo: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించగా శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ను స్పీడ్ పెంచిన మూవీటీమ్.. ఈ మూవీలోని ఓ పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 'ఓ ఇషా' అనే లవ్ వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. పూర్తి పాటను ను మే 18న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. కాగా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.