తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అలా చేయలేదని దర్శకుడు హరీశ్​ శంకర్​ బాగా తిట్టేశారు'

Akashpuri Alitho Saradaga: ఓ సినిమా షూటింగ్​లో దర్శకుడు హరీశ్​ శంకర్​ తనను బాగా తిట్టినట్లు గుర్తుచేసుకున్నాడు యువ హీరో ఆకాశ్​పూరి. చిన్నతనంలో ఓ సారి దొంగతనం చేసి దొరికిపోయినట్లు చెప్పాడు. త్వరలోనే అతడు 'చోర్​బజార్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా ఆలీతో సరదాగాకు విచ్చేసిన అతడు ఈ విషయాలను తెలిపాడు. ఇంకా ఏం చెప్పాడంటే..

Akash puri Alitho saradaga
ఆకాశ్​పూరి ఆలీతో సరదాగా

By

Published : Jun 15, 2022, 1:50 PM IST

Updated : Jun 15, 2022, 5:12 PM IST

Akashpuri Alitho Saradaga: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడిగా తెరంగేట్రం చేసినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆకాశ్‌ పూరి. పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన ఆయన 'ఆంధ్రాపోరి' సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం 'చోర్‌ బజార్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆకాశ్‌ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి.. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నాడు. ఆ విశేషాలివీ..

హరీశ్​శంకర్​ బాగా తిట్టారు.. 'గబ్బర్​సింగ్​'లో పవన్​కల్యాణ్​ చిన్నప్పుడి క్యారెక్టర్​ చేశా. అప్పుడు ట్రాక్టర్​ మీద ఎక్కి ఓ డైలాగ్​ చాలా గట్టిగా, ఎమోషన్​గా చెప్పాలి. కానీ నేనేమో చిన్నగా చెప్పా. అలా మళ్లీ మళ్లీ చిన్నగానే చెప్పా. వెంటనే హరీశ్​శంకర్​ లేచి కుర్చీని తన్ని 'సరిగ్గా రాదా' అని తిట్టారు. అప్పుడు ఎమోషన్​ వచ్చింది. అప్పుడు అర్థమైంది.. ఎమోషన్​గా డైలాగ్​ ఎలా చెప్పాలి. ఆయన నుంచే నేర్చుకున్నా. ఆయనకు థ్యాంక్స్​. పవన్ ​చిన్నప్పుడు క్యారెక్టర్​ చేయడం చాలా హ్యాపీగా ఉంది.

జిమ్​లో క్లీనింగ్​కు వెళ్లా.. పదో తరగతి చదవడం మానేశా. సినిమాల్లోకి వెళ్తాను నాన్న అని చెప్పా. టెన్త్​కే ఎంబీబీఎస్‌ చేసినట్టు ఫీలయ్యా. డాడీ నన్ను లైన్​లో పెట్టాలనుకున్నారు. పార్ట్​టైమ్​ జాబ్​లో పెడతానన్నారు. అలానే జిమ్​కు మేనేజర్​తో కలిసి వెళ్లా. అక్కడి వాళ్లకు నన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ గుర్తుపట్టలేకపోతున్నారు. ఉద్యోగం ఎందుకు అంటే.. ఆర్థిక సమస్యలు అని చెప్పా. అవన్నీ క్లీన్​ చేయాలి అంటూ నేను చేయాల్సిన పనులు, అక్కడి రూల్స్ చెప్పారు. ఈలోగా నాకొక ఫోన్ వచ్చింది. నాది ఐఫోన్. అది చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది. నువ్వు పూరీ జగన్నాథ్ కొడుకువా అని అడిగారు. కాదన్నా. కానీ.. పక్కన ఓ వ్యక్తి వచ్చి అవునని చెప్పాడు. నన్ను ఆ ఉద్యోగంలో చేర్చుకోలేదు. నాన్నకు చెప్పా. రెండు రోజుల్లో ఇంకోటి చూస్తా అని చెప్పారు. నేనింతే సినిమాకు ఒక రోజంతా ప్రొడక్షన్ బాయ్​గా చేయించారు. కాఫీలు, టీలు అందించా. ఇంతపెద్ద డైరక్టర్​ కొడుకుని ఇలా ఎందుకు చేస్తున్నా అని నాకు ఎప్పుడూ అనిపించలేదు.

నాన్నను లాఠీతో కొట్టి వెళ్లిపోమన్నారు.. అర్చన గారితో నటించడం చాలా అదృష్టంగా భవిస్తున్నాను. నాన్న ఓ జరిగిన ఇన్సిడెంట్​ చెప్పారు. ఆమెను డబ్బింగ్​ చెప్పడం కోసం ఓ స్డూటియోకి వస్తే.. తనను చూసేందుకు నాన్న గోడపై నుంచి ఎగిరి ఎగిరి చూశారంట. అప్పుడు ఓ సెక్యూరిటీ లాఠీతో కొట్టి వెళ్లిపోమన్నారట.

జేబులో పెట్టుకుని వెళ్లిపోయా..అప్పటికే లయన్​ కింగ్​ సీడీలు ఓ పది కొనిపించాను. అందులో కొన్ని విరిగిపోయాయి. అరిగిపోయాయి. మళ్లీ కావాలని అడిగా. కొనిపించలేదు. సైలెంట్​గా ప్యాంట్​లో పెట్టుకుని వచ్చేశా. కానీ దొరికిపోయా. ఇక దబిడి దిబిడే(నవ్వుతూ).

అయిపోయాం అనుకున్నా.. స్విమ్మింగ్ ఫూల్​ ఉన్న నేను పవిత్రతో (చెల్లి) బీచ్​లో ఆడుకుంటున్నా. ఒక్కసారిగా పెద్ద అల వచ్చి తనను లాక్కువెళ్లింది. వెంటనే నేను దూకి తనను తీసుకొచ్చా. నేను స్విమ్మర్​. ఛాంపియన్​ కూడా. తనపని అయిపోయింది అనుకున్నా. కానీ లక్కీగా బయటకు తెచ్చా. ఆ సమయంలో చాలా ఎమోషనల్​ అయిపోయా. అప్పుడే తెలిసింది తను అంటే నాకు చాలా బాగా ఇష్టమని.

రాజమౌళి, త్రివిక్రమ్​, వివి వినాయక్​ సినిమాలు బాగా ఇంపాక్ట్​ చేశాయని, వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపాడు ఆకాశ్​. 'ధోనీ' సినిమాకుగానూ తొలిసారి పారితోషకం అందుకున్నానట్లు చెప్పాడు. నటుడు రామ్‌చరణ్‌ తనకు పలు రకాలుగా హెయిర్‌ స్టైల్‌ చేశారని నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. హీరోల్లో ప్రభాస్​ తనకు బాగా క్లోజ్​ అని తెలిపాడు.

ఇదీ చూడండి: ఆ ప్రొడ్యూసర్ బెదిరించాడు.. తేడా వస్తే నేను మసి: హీరోయిన్ ఆవేదన​

Last Updated : Jun 15, 2022, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details