తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​తో గొడవ.. అసలు విషయం చెప్పేసిన అలీ.. 6 ఏళ్ల పాటు ఒక్క పూట భోజనంతోనే.. - అలీ కూతురు పెళ్లి

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ తనకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు జరుగుతన్న ప్రచారంపై మరోసారి స్పందించారు కమెడియన్​ అలీ. ఎట్టకేలకు తామిద్దరి మధ్య ఏం జరిగిందో వివరణ ఇచ్చారు! దీంతో పాటే తన సినిమా లైఫ్ గురించి, కూతురు పెళ్లి గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆ సంగతులు..

Alitho saradaga about Pawankalyan
పవన్​తో ఆలీ గొడవ

By

Published : Dec 20, 2022, 10:59 AM IST

Updated : Dec 20, 2022, 11:54 AM IST

పవన్​తో గొడవపై మరోసారి స్పందించిన అలీ

పవన్​ కల్యాణ్-అలీ.. ఇండస్ట్రీలో ఎంత మంచి స్నేహితులో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై మరోసారి స్పందించారు. ఎట్టకేలకు అసలు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు. తన కూతురు పెళ్లికి కూడా పవన్​ ఎందుకు రాలేదో క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో పాటే తాను ఎదుర్కొన్న సినిమా కష్టాలు, కూతురు పెళ్లి గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆ సంగతులు..

పవన్​తో వివాదం.. నాకు పవన్​ కల్యాణ్​ మధ్య గ్యాప్​ రాలేదు. అది క్రియేట్​​ చేశారు. రీసెంట్​గా నా కూతురు పెళ్లికి ఆహ్వానించడానికి ఆయన సినిమా సెట్​కు కూడా వెళ్లాను. అక్కడ ఇద్దరం కలిసి ఓ 15 నిమిషాలు కూడా మాట్లాడుకున్నాం. చివరి నిమిషంలో ఆయనకు ఫ్లైట్​ మిస్​ అవ్వడం వల్లే పెళ్లికి రాలేకపోయారు. ఈ విషయం జనాలకు తెలీదు. కొన్ని వెబ్​సైట్లు తప్పుగా కథనాలు రాసి అసత్య ప్రచారాలు చేశాయి.

ఒంటి పూట భోజనం.. సినిమా కష్టాలు చాలా చూశాను. ఆరేళ్ల పాటు ఒంటి పూట భోజనం చేశాను. కానీ ఎవరీ సాయం తీసుకోలేదు. 1984-90 వరకు అడపాదడపా సినిమాలు మాత్రమే చేశాను. అద్దె కూడా కట్టుకోలేకపోయాను. దీంతో ఫ్రెండ్ బట్టలు ఉతికేవాడిని. వంట చేసిపెట్టేవాడిని. అతడు అద్దె కట్టేవాడు.

అస్తులు చూసి చేయలేదు.. అలీ అల్లుడు ఆస్తులు ఎంతో తెలుసా అంటూ ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వచ్చాయి. దీనిపై గురించి కూడా అలీ మాట్లాడారు. "ఆస్తులు చూసి పెళ్లి చేయలేదు. వాళ్లది మంచి కుటుంబం. నా కూతురిని ఓ ఫ్రెండ్​గా,​ వైఫ్​గా, బిడ్డగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నేనే చేసిన కొన్ని మంచి పనులు వల్ల మంచి అల్లుడు దొరికాడు. అందరూ అతడు డాక్టర్​ అని అనుకుంటున్నారు. కానీ అతడు ఫారెన్​లో రోబోటిక్ ఇంజనీర్​. కానీ వాళ్ల కుటుంబంలో అందరూ డాక్టర్లే. ఇప్పుడు నా అల్లుడు కూతురు అమెరికాలో చాలా ఆనందంగా ఉన్నారు" అని అన్నారు.

నలుగురితో మొదలై 1000 మంది వరకు.. ఆలీతో సరదాగా షో గురించి మాట్లాడుతూ.. "నేనేనా ఇన్ని ఎపిసోడ్​లు చేశానా అనిపిస్తుంది. ప్రతిఒక్కరితో ఓ మర్చిపోలేని అనుబంధం ఏర్పడింది. నాది చాలా పెద్ద కుటుంబం. ఇప్పుడు నా కుటుంబంలో 680 వరకు ఉన్నారు. నా కూతురు పెళ్లికి వెయ్యి మంది దాకా వచ్చారు. అప్పట్లో బర్మా నుంచి మా నానమ్మ, తాత, నానమ్మ తమ్మడు, మా నాన్న.. ఇలా నలుగురు వచ్చారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం ఏర్పడింది. ఇకపోతే ఈ షో తొలి ఎపిసోడ్​ను​ మంచు లక్ష్మీతో ప్రారంభించాను. తనకు నా ధన్యవాదాలు." అని చెప్పారు.

ఇదీ చూడండి:ఆయన లేకుంటే నా లైఫ్​ ఇలా ఉండేది కాదు: అల్లుఅర్జున్​

Last Updated : Dec 20, 2022, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details