ఈ సారి ఆస్కార్ రేసులో ఇండియన్ సినీ ఇండస్ట్రీని నుంచి గట్టి పోటీ ఉండనుందా అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్, నాని శ్యామ్ సింగరాయ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హిందీ సినిమా పేరు వినిపిస్తోంది. అదేంటంటే..
ఆస్కార్ రేసులో అలియా భట్ సినిమా - ఆలియాభట్ గంగూబాయ్ కతియావాడి ఆస్కార్ రేస్
సినీ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఆస్కార్' వేదికపై ఈసారి భారతదేశం నుంచి పోటీ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్', శ్యామ్‌సింగరాయ్ వంటి చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ బరికి నామినేట్ అయ్యే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు రాగా.. ఇప్పుడు, మరో బీటౌన్ సినిమా పేరూ వినిపిస్తోంది. అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా ఈసారి ఆస్కార్ రేసులో ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? దాని విశేషాలేమిటి?
ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. గంగూబాయిగా అలియా నటించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 ఆరంభంలో విడుదలై మంచి టాక్ అందుకుంది. అలియా నటనకు సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. విదేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించగా ప్రేక్షకులందరూ కరతాళధ్వనులతో ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే 'గంగూబాయి కతియావాడి' ఆస్కార్‌కు వెళ్లే అవకాశం ఉందంటూ బాలీవుడ్ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి. అలియా నటన, విదేశాల్లో సినిమాకు లభించిన గుర్తింపు.. ఇలాంటి అంశాలు అందుకు దోహదపడుతున్నాయని ఆయా కథనాల్లోని సమాచారం. ఈ వార్తలు చూసిన అలియా అభిమానులు ఆమెను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'దేవదాస్' గతంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: స్టేజ్‌పై అభిమాని కాళ్లకు నమస్కరించిన స్టార్హీరో, ఎందుకంటే