తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజమౌళిపై అలక'... ఆలియా భట్ స్పందన ఇదే.. - ఆలియా భట్ ఇన్​స్టాగ్రామ్ పోస్ట్

Alia Bhatt on deleting RRR posts: ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్ర నిడివిపై అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆలియా భట్ ఖండించారు. రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి వదంతులను ప్రచారం చెయ్యొద్దని కోరారు.

alia-bhatt-on-deleting-rrr-posts
alia-bhatt-on-deleting-rrr-posts

By

Published : Mar 31, 2022, 4:50 PM IST

Alia Bhatt on deleting RRR posts: ఆర్ఆర్ఆర్ సినిమాలో పాత్ర విషయమై అసంతృప్తితో ఉన్నట్లు తనపై వస్తున్న వదంతులను ఆలియా భట్​ కొట్టిపారేశారు. ఇలాంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని స్పష్టం చేశారు. ఇన్​స్టాలో ఆర్ఆర్ఆర్​కు సంబంధించిన పలు పోస్టులు డిలీట్ చేసిన విషయంపై స్పందించారు ఆలియా. తన ఖాతాలో పోస్టులు చిందరవందరగా ఉండకుండా ఓ క్రమంలో ఉండేలా చూసేందుకు కొన్ని వీడియో పోస్టులను తొలగించానని చెప్పారు. తాను ఇదివరకు కూడా కొన్ని పోస్టులను డిలీట్ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

ఆలియా ఇన్​స్టా పోస్ట్

"ఆర్ఆర్ఆర్ టీమ్​పై అసంతృప్తితో ఆ చిత్రానికి సంబంధించిన పోస్టులను డిలీట్ చేశానని ఈ మధ్య వార్తలు వచ్చాయి. దీని గురించి నేను ఈరోజే తెలుసుకున్నా. 'ఇన్​స్టాగ్రామ్ గ్రిడ్​' కోసం చేసే ఈ చిన్న పనిని పెద్దదిగా చూపుతూ ఊహాగానాలు ప్రచారం చేయొద్దని అందరినీ కోరుతున్నా. ఆర్ఆర్ఆర్ సినిమాలో భాగమైనందుకు నేను అత్యంత కృతజ్ఞతతో ఉన్నా. రాజమౌళి దర్శకత్వంలో సీత పాత్రను పోషించడం పట్ల సంతోషంగా ఉన్నా. తారక్, చరణ్​తో కలిసి పనిచేయడం సహా చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని నేను ప్రేమిస్తున్నా."
-ఆలియా భట్

రాజమౌళి, ఆయన బృందంతో కలిసి ఏళ్ల పాటు చిత్ర నిర్మాణం కోసం కష్టపడ్డారని.. ఆ కారణం వల్లే తాను ఈ వివరణ ఇస్తున్నానని ఆలియా తెలిపారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం కాకూడదన్న ఉద్దేశంతో తాను ఈ పోస్టు పెట్టినట్లు స్పష్టం చేశారు.

తన సోషల్​మీడియాలో ఖాతాలో 'ఆర్​ఆర్​ఆర్'​కు సంబంధించిన కొన్ని పోస్ట్​లను ఆలియా తొలిగించిందని, ఇన్​స్టాలో జక్నన్నను అన్​ఫాలో చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇన్​స్టాగ్రామ్​లో మంగళవారం ఉదయం ఆలియా.. రాజమౌళిని అన్​ఫాలో చేశారని, ఆ సమయంలో ఆలియా ఫాలో అవుతున్న వారి సంఖ్య 472గా ఉందని.. అందులో రాజమౌళి పేరు కనపడలేదని నెటిజన్లు గుర్తించారు. కానీ ఈ ప్రచారం జోరుగా సాగిన తర్వాత ఆమె ఫాలో అవుతున్న వారి సంఖ్య 474కు చేరింది. అందులో జక్కన్న పేరు కూడా కనిపించింది. మరి ఆమె అన్​ఫాలో చేసి ఆ తర్వాత ఫాలో అయిందా లేదా నెటిజన్లు సరిగ్గా చూసుకోకుండా తప్పుడు ప్రచారం చేశారా అనేది స్పష్టత లేదు. అయితే, ఇన్​స్టాలో నటీనటులు తరచుగా గ్రిడ్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. ఒకే ఫొటోను 9 భాగాలుగా విభజించి.. తొమ్మిది పోస్టులు పెడుతుంటారు. అన్నీ వరుసలో ఉంటేనే.. గ్రిడ్ ఫొటో సరిగ్గా కనిపిస్తుంది. ఇందుకోసమే ఆలియా పలు వీడియో పోస్టులను తొలగించినట్లు.. తాజా వివరణను బట్టి అర్థమవుతోంది.

ఇదీ చదవండి:కంగన కొత్త చిత్రం.. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ తానై..

ABOUT THE AUTHOR

...view details