తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Alia Bhatt Gal Gadot Interview : హాలీవుడ్‌ నటికి తెలుగు నేర్పిన అలియా భట్.. వీడియో చూశారా? - alia bhat latest news

Alia Bhatt Gal Gadot Interview : బాలీవుడ్ నటి అలియా భట్ 'హార్ట్‌ ఆఫ్ స్టోన్‌' చిత్రంతో హాలీవుడ్​లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హాలీవుడ్​ నటి గాల్​ గాడోట్​కు.. అలియా తెలుగు నేర్పించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వీడియో మీరు చూశారా?

Alia Bhatt Gal Gadot Interview
Alia Bhatt Gal Gadot Interview

By

Published : Aug 8, 2023, 6:06 PM IST

Updated : Aug 8, 2023, 7:34 PM IST

Alia Bhatt Gal Gadot Interview : ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షలకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆమె 'హార్ట్​ ఆఫ్ స్టోన్'​ చిత్రంతో​ హలీవుడ్​లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అలియా.. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా హాలీవుడ్​ నటి గాల్ గాడోట్​కు తెలుగులో మాట్లాడటం నేర్పించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Alia Bhatt Hollywood Movie Name : అలియా భట్​ నటించిన కొత్త హాలీవుడ్ చిత్రం 'హార్ట్​ ఆఫ్ స్టోన్'..​ ఆగస్టు 11న నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. అలియా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్లతో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పొల్గొన్న అలియా.. ఈ సినిమా కథానాయకులకు తెలుగులో మాట్లాడటం నేర్పించారు. నటి గాల్ గాడోట్​కి 'అందరికి నమస్కారం.. మీకు నా ముద్దులు..' అని పలకడం నేర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. తెలుగులో క్యూట్​గా మట్లాడారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Alia Bhatt Heart Of Stone Promotions : అలాగే ఈ ఇంటర్వ్యూలో అడిగిన మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు అలియా సమాధానం చెప్పారు. తాను ఇప్పటి వరకు టాటూ వేయించుకోలేదని అన్నారు. తన భర్త రణ్​బీర్ ఇద్దరు ఒకేలాంటి పచ్చబొట్టు వేయించుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. ఆస్కార్ అవార్డు అందుకున్న 'నాటు నాటు' పాటును కూడా పాడారు. ఆ పాటకి డాన్స్ స్టెప్పు​లు కూడా వేశారు. అలియా భట్ 'ఆర్ఆర్ఆర్', 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రమోషన్స్​లో తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బ్రహ్మాస్త్రం సినిమా ఇంటర్వ్యూలో తెలుగులో పాట పాటి ఆకట్టుకున్నారు.

అలియా భట్ తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల అలియాపై ప్రశంసలు కురిపించారు ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి, రచయిత్రి సుధామూర్తి. ఎమోషనల్​ సీన్స్​ చూసి తానెప్పుడూ కంటతడి పెట్టుకోలేదని.. కానీ అలియా నటించిన 'రాజీ' సినిమాలోని అలియా నటనకు ఏడ్చేశానంటూ చెప్పకొచ్చారు. సుధామూర్తి.. అలియా గురించి ఇంకా ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

నిమిషం వీడియోలో 20కి పైగా చీరల్లో అలియా.. అందం అసూయపడేలా..

అలియా ఇంట్లో పైజామా పార్టీ తారల సందడే సందడి

Last Updated : Aug 8, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details