బాలీవుడ్ నటి ఆలియా భట్ గర్భవతి అయ్యింది. ఏప్రిల్‌లో నటుడు రణబీర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా.. తాజాగా గర్భవతి అయినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన అల్ట్రా సౌడ్ స్కానింగ్ రిపోర్టును అందులో పంచుకుంది. తాను, రణబీర్.. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అలియా భట్ ఈ శుభవార్తని ఇన్‌స్టాలో పెట్టిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. హాస్పిటల్లో కన్ఫర్మ్ అయిన తర్వాత.. బెడ్ పై నుంచి అలియా.. ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. అయితే ఆస్పత్రి బెడ్ పైన ఉన్న పిక్‌తో పాటు.. ఆడసింహం, మగ సింహం తమ బేబీ సింహంతో ఉన్న క్యూట్ ఫొటో కూడా అలియా షేర్ చేసింది.
తల్లి కాబోతున్న ఆలియా భట్.. ఇన్‌స్టాలో పోస్ట్ - alia bhatt ranbir kapoor latest news
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.
అలియా భట్ ఈ శుభవార్తని ఇన్‌స్టాలో పెట్టిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు, బీ టౌన్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి అలియా భట్, రణ్‌బీర్‌కపూర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అనిల్ కపూర్, ప్రియాంక చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, డయానా పెంటీ, కరణ్ జోహార్, మౌనిరాయ్, టైగర్ ష్రాఫ్.. తదితర సినీ ప్రముఖులు అలియా, రణబీర్ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ఆలియా., రణబీర్ కలిసి నటించిన బ్రహ్మాస్త చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.