తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు సారీ.. ఆ యాడ్​ నుంచి తప్పుకున్న అక్షయ్ - ఆ యాడ్ నుంచి తప్పుకున్న అక్షయ్​ కుమార్​

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్..​ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఓ పొగాకు ఉత్పత్తి సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

akshay kumar
అక్షయ్​కుమార్​

By

Published : Apr 21, 2022, 9:46 AM IST

Akshaykumar Panmasala add: సినీహీరోలు సినిమాలతో పాటు ప్రకటనల ద్వారా కూడా అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇప్పటికే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ప్రొడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు.

గత కొంతకాలంగా అక్షయ్ కుమార్.. విమల్ పాన్ మసాలాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్షయ్ టొబాకో ప్రోడక్ట్​కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఆయన అభిమానులకు నచ్చలేదు. దీంతో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి అనేక ప్రతిపాదనలు రావడం వల్ల.. టొబాకో బ్రాండ్‌కు ఇకపై అంబాసిడర్‌గా కొనసాగనని అక్షయ్​ తాజాగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్​ చేశారు.

"నేను.. నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా మీ నుంచి వస్తున్న స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించలేదు.. ఆమోదించను కూడా. ఇక పై ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్​గా​ తప్పుకుంటున్నా. అయితే ఆ సంస్థతో ప్రస్తుతం ఉన్న ఒప్పంద గడువు వరకు ప్రకటనలు మాత్రం వస్తుంటాయి. ఈ యాడ్​ ద్వారా నాకు వచ్చిన ఆదాయాన్ని మంచి పనులకు వినియోగిస్తాను. భవిష్యత్​లో చట్టపరమైన ప్రకటనలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్​గా ఉంటాను." అని అక్షయ్​ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: రష్మికకు సూపర్​ ఆఫర్​.. ఆలియా స్థానంలో!

ABOUT THE AUTHOR

...view details