తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జాక్వెలిన్​ గురించి ఆ ప్రశ్న.. ఆమె నచ్చదన్న అక్షయ్! - అక్షయ్ కుమార్

Akshay Kumar Jacqueline Fernandez: బాలీవుడ్ హాట్​ బ్యూటీ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ కన్నా నటి కృతి సనన్ అంటేనే తనకు ఇష్టమని చెప్పారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. జాక్వెలిన్ గురించి అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో ఈ మేరకు సమాధానమిచ్చారు అక్షయ్. ఇంతకీ అదేంటంటే?

jacqueline fernandez
akshay kumar and jacqueline fernandez

By

Published : Mar 17, 2022, 9:37 AM IST

Updated : Dec 23, 2022, 4:18 PM IST

Akshay Kumar Jacqueline Fernandez: బాలీవుడ్​ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ కన్నా నటి కృతి సనన్​ అంటే తనకు ఇష్టమని చెప్పారు 'ఖిలాడి' హీరో అక్షయ్​ కుమార్. ఈ ఇద్దరు భామలతో కలిసి ఆయన నటించిన సినిమా 'బచ్చన్​ పాండే'. హోలీ కానుకగా ఈ నెల 18న విడుదల కానుంది.

తన సినిమాల ప్రచారన్ని విభిన్నంగా నిర్వహించే అక్షయ్.. 'బచ్చన్‌ పాండే'ను కూడా తనదైన శైలిలో ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం రైలులో ముంబయి నుంచి దిల్లీకి వెళ్లింది. ఆ సమయంలో తీసిన ఓ సరదా వీడియోను ఆన్‌లైన్‌లో అభిమానులతో పంచుకున్నారు అక్షయ్‌.

నిద్రపోయినట్లు నటిస్తున్న ఆయన్ను సహచరులు లేపి 'మీకు ఇష్టమైన నటి ఎవరు?' అని అడుగుతారు. 'జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌' అని బదులిచ్చిన అక్షయ్‌ను ఆమె పేరుకు స్పెల్లింగ్‌ చెప్పమని కోరుతారు. అయితే అక్షయ్‌ స్పెల్లింగ్‌ చెప్పలేక తన సమాధానం జాక్వెలిన్‌ కాదు.. కృతిసనన్‌ అని చెప్పి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు.

నేనేమైనా తప్పు చెప్పానా అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు అక్షయ్‌. ఫర్హాద్‌ సామ్‌జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్‌ విభిన్న గెటప్‌లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి:పవన్​ చిత్రం నుంచి జాక్వెలిన్​ ఔట్​.. ఆ భామకు ఛాన్స్​!

Last Updated : Dec 23, 2022, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details