Akshay Kumar Indian Citizenship : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారత పౌరసత్వాన్ని పొందారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2019లోనే తాను పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, కొవిడ్ కారణంగా ఆయనకు రెండున్నరేళ్లు ఆలస్యంగా పౌరసత్వం వచ్చినట్లు అక్షయ్ వెల్లడించారు.
Akshay Kumar Citizenship Controversy: 2019 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ సమయంలో అక్షయ్ పౌరసత్వం విషయంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో విజ్ఞప్తి చేయగా.. 'ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్ కోసం పిలుపివ్వడం ఎంటి' అంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ విమర్మలపై స్పందించిన ఆయన అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు భారత పౌరసత్వం లభించింది.