AKSHAY KUMAR COMMENTS ON HIS RECENT DISASTERS: బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజాగా నటించిన బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీ రాజ్, రక్షాబంధన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలవకపోవడంతో తన విషయంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారని సోవవారం మీడియాకు తెలిపారు. సినిమాలు అనుకున్న విజయం సాధించకపోవడం పట్ల స్పందించిన ఆయన తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అయిన 'కత్‌పుత్లీ' ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం కానున్న సందర్భంగా శనివారం ఆ మూవీ లాంచ్‌లో అక్షయ్ పలు వ్యాఖ్యలు చేశారు.
"సినిమాలు పనిచేయడం లేదు, అది మా తప్పు, ఇది నా తప్పు. "నేను మార్పులు చేయాలి, ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో నేను అర్థం చేసుకోవాలి. నేను మార్పులు చేయాలనుకుంటున్నాను, నేను నా మార్గాలు, నా ఆలోచనా విధానాలు, నేను చేసే సివిమాల విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను మాత్రమే నిందించాలి మరెవరినీ కాదు". - అక్షయ్ కుమార్, బాలీవుడ్ నటుడుముంబైలో జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్‌కు అక్షయ్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సర్గుణ్ మెహతా, చంద్రచూర్ సింగ్, జాకీ భగ్నానీ, దీప్షికా,రంజిత్ తివారీ పాల్గొన్నారు.
ఓటీటీ అనేది సురక్షిత ప్లాట్ఫారం కాదని,సినిమా అన్ని చోట్ల రిలీజ్ అయినట్టే ఇక్కడా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు, విమర్శకులు, మీడియా మిత్రులు ఈ చిత్రాన్ని నెట్లో చూసి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంటారు. మన కృషికి ఏ మాత్రం ఫలితం దక్కిందనే విషయం ప్రేక్షకుల రివ్యూల ద్వారా తెలుస్తుందని అక్షయ్ కుమార్ అన్నారు.