తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమ్మ​ కోసం అకీరా స్పెషల్‌ గిఫ్ట్.. ఇది భయపెట్టేస్తుంది అంటూ పోస్ట్! - renu desai ai viral photos

Renu Desai Photos : తన కుమారుడు అకీరా నందన్ క్రియేట్​ చేసిన ఏఐ ఫొటోలను ప్రేక్షకులతో పంచున్నారు ప్రముఖ నటి రేణూ దేశాయ్​. అయితే ఆ ఫొటోలు అందంగా ఉన్నాయని.. కానీ వాటిని చూస్తే భయమేస్తోందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

Renu Desai Akira Nandan AI Photos
రేణూ కోసం అకీరా స్పెషల్‌ గిఫ్ట్.. ఇది నిజంగా భయపెట్టేస్తుంది అంటూ పోస్ట్‌

By

Published : Jul 15, 2023, 10:41 PM IST

Renu Desai Photos : ప్రముఖ నటి, రచయిత రేణూ దేశాయ్​ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా రేణూ దేశాయ్​ తన తనయుడు అకీరా నందన్‌కు సంబంధించిన విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. అకీరా ఇచ్చిన ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ను అభిమానులకు చూపించారు. తనకు సంబంధించిన కొన్ని పాత ఫొటోలను ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (కృత్రిమ మేధ) వెర్షన్‌లో క్రియేట్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడని రేణూ దేశాయ్ తెలిపారు. 'అకీరా.. నా ఏఐ వెర్షన్‌ను క్రియేట్‌ చేశాడు. ఏఐ ఫొటో చూడటానికి ఎంత అందంగా ఉందో. అదే విధంగా భయానికీ గురి చేస్తుంది' అని ఆమె తెలిపారు. అలాగే, కొన్ని నిమిషాల్లోనే అకీరా వీటిని క్రియేట్‌ చేశాడని చెప్పారు. ఈ ఫొటోలను పలువురు నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

ఇక, రేణూ దేశాయ్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. 2003లో విడుదలైన 'జానీ' తర్వాత వెండితెరకు ఆమె దూరమయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్‌ నాగేశ్వరరావు' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నటిగానే కాకుండా స్టైలిష్ట్‌, నిర్మాతగానూ ఆమె పలు చిత్రాలకు వ్యవహరించారు. అకీరా చదువుకుంటూనే మ్యూజిక్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల ఓ షార్ట్‌ ఫిల్మ్‌కు అకీరా సంగీతం అందించారు. 'రైటర్స్‌ బ్లాక్‌' పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ ఫిల్మ్‌కు అకీరా అందించిన మ్యూజిక్‌ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఫ్యాన్​పై ఫైర్ అయిన రేణూ దేశాయ్​!
అకీరా నందన్‌ ఈ ఏడాది ఏప్రిల్​లో 19వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రేణు దేశాయ్​ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇక ఆ వీడియోపై పలువురు పవన్​ అభిమానులు కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆ పోస్ట్​పై స్పందించిన ఓ ఫ్యాన్​ "మేడమ్‌.. ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది" అని కామెంట్‌ చేశాడు. దీంతో ఆ కామెంట్‌పై అసహనం వ్యక్తం చేసిన రేణు.. "మీ అన్న తనయుడా..? అకీరా నా అబ్బాయి!! మీరు వీరాభిమానాలు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడే పద్ధతి కొంచం నేర్చుకోండి! ఇలాంటి మెసేజ్​లు, కామెంట్లను నేను ప్రతిసారీ పట్టించుకోకుండా వదిలేస్తుంటాను. కానీ, మీలాంటి కొంతమంది మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు" అంటూ రిప్లై ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details