తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​కల్యాణ్​ కొత్త ప్రాజెక్ట్‌.. అకీరా నందన్​ రియాక్షన్​ ఇదే - పవన్​ సుజిత్ మూవీపై అకీరా నందన్ కామెంట్స్​

తన తండ్రి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించనున్న కొత్త ప్రాజెక్ట్‌ విషయంలో అకీరా నందన్‌ స్పందించాడని తెలిసింది. ఆ వివరాలు..

Akira nandan comments on Power star pawankalyan sujeeth movie
పవన్​కల్యాణ్​ కొత్త ప్రాజెక్ట్‌.. అకీరా నందన్​ రియాక్షన్​ ఇదే

By

Published : Dec 6, 2022, 10:43 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దర్శకుడు సుజిత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు ఇటీవలే చత్ర బృందం ప్రకటించింది. ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ సైతం విడుదలైంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే ప్రభాస్​, రామ్​చరణ్​, మంచు మనోజ్​ సహా పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమా మరోస్థాయిలో ఉండనుందని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. టీమ్‌కు అభినందనలు తెలిపారు. అయితే తాజాగా పవన్‌కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ కూడా స్పందించాడని తెలిసింది. ఈ భారీ ప్రాజెక్ట్​పై చాలా ఆనందంగా ఉన్నాడట. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని హీరో అడివిశేష్ తెలిపారు.

'హిట్‌-2' ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్‌.. తన మిత్రుడు సుజిత్ , పవన్‌తో సినిమా చేయడంపై స్పందిస్తూ.. "దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సుజిత్‌కు సరైన ప్రాజెక్ట్‌ కుదిరింది. 'సాహో' తర్వాత ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్‌ సుజిత్‌తో సినిమా చేయడానికి వెంటపడ్డారు. కానీ, అతడు అంగీకరించలేదు. తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నట్టు వాళ్లతో చెప్పాడు. అలా, తనకెంతో ఇష్టమైన హీరోతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో అకీరా ఆనందంగా ఉన్నాడు. సినిమా కోసం తను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

'సాహో' తర్వాత సుజిత్‌ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. పవర్‌స్టార్‌ హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది నిర్మితం కానుంది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండొచ్చని కాన్సెప్ట్‌ పోస్టర్‌ని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదీ చూడండి:షారుక్​తో​​ సాంగ్​కు ఐదుగురు హీరోయిన్స్​ నో కానీ ఆ పాటతోనే మలైకా అరోరా స్టార్​గా

ABOUT THE AUTHOR

...view details